Trains Cancelled : అర్నబ్ తుపాను.. విశాఖ నుండి నడిచే 53 రైళ్ళు రద్దు .. ఫుల్ డీటెయిల్స్ ఇవే..

Must read

Trains Cancelled : పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ‘అర్నబ్’ అతి తీవ్ర తుపానుగా బలపడింది. వేగంగా కదులుతున్న ఈ తుపాను ఆంధ్రప్రదేశ్‌ తీరంవైపు దూసుకొస్తోంది. మంగళవారం ఉదయానికి విశాఖపట్నానికి 300 కిలోమీటర్లు, కాకినాడకు 360 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 460 కిలోమీటర్లు, బాపట్లకు 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ తుపాను కారణంగా ఇవాళ, రేపు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, 115 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ అయింది.

Also Read : School Holidays : అర్నబ్ తుపాన్ ఎఫెక్ట్.. ఏపీలోని ఈ జిల్లాల్లో నేడు, రేపు విద్యా సంస్థలకు సెలవులు..

అర్నబ్ తుపాను నేపథ్యంలో దక్షిణ కోస్తా రైల్వే అప్రమత్తమైంది. విశాఖపట్టణం నుండి నడిచే 53రైళ్లు రద్దు చేసింది. ప్రయాణికుల సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేసింది. తుపాను ప్రభావంతో ట్రాక్ లు దెబ్బతినకుండా ఉండేందుకు తగిన సిబ్బందిని ఏర్పాటు చేసింది. దక్షిణ కోస్తా రైల్వే జీఎం సందీప్ మాథుర్ నాలుగు డివిజన్ల డీఆర్ఎంలతో సోమవారం సమీక్షించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైల్వే వంతెనలు, పట్టాలు, యార్డులు, సిగ్నల్ వ్యవస్థలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. జోనల్, డివిజన్ ప్రధాన కార్యాలయాల్లో వార్ రూమ్ లు, ప్రయాణికులు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైళ్లు రద్దయితే టికెట్ రీ-ఫండ్ కోసం అదనపు కౌంటర్లు నిర్వహించనున్నారు.

రద్దయిన రైళ్లు ఇవే..
విశాఖపట్టణం – కిరండూల్ – విశాఖపట్టణం (18515-18516) నైట్ ఎక్స్‌ప్రెస్ ఈనెల 29 నుంచి నవంబర్ 4వ తేదీ వరకు రద్దు చేశారు. అదేవిధంగా విశాఖపట్టణం – కొరాపుట్ – విశాఖపట్టణం (58538-58537) పాసింజర్ ఈనెల 27వ తేదీ నుంచి ఈనెల 31వ తేదీ వరకు రద్దు చేశారు. విశాఖపట్టణం – కొరాపుట్ – విశాఖపట్టణం (18512 – 18511) ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ఈనెల 30 నుంచి 31వ తేదీ వరకు రద్దు చేశారు. విశాఖపట్టణం – కిరండూల్ – విశాఖపట్టణం (58501-58502) పాసింజర్ రైలు ఈనెల 27 నుంచి ఈనెల 30వ తేదీ వరకు రద్దు చేశారు. అదేవిధంగా రాజమండ్రి – విజయవాడ, విజయవాడ – మచిలీపట్నం, మచిలీపట్నం – గుడివాడ, కాకినాడపోర్ట్ – విశాఖపట్టణం, పార్వతీపురం – విశాఖపట్టణం, విజయవాడ – నరసాపురం, నరసాపురం – నిడదవోలు, భీమవరం – నిడదవోలు, గుంటూరు – రేపల్లె తోపాటు తదితర రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు.

భువనేశ్వర్ – జగదల్‌పూర్ హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ (18447) ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు రాయగడ రైల్వే స్టేషన్ లో ఆగిపోతుంది. జగదల్ పూర్ – భువనేశ్వర్ హీరాఖండ్ ఎక్స్ ప్రెస్ (18448) ఈనెల 28 నుంచి నవంబరు 31వ తేదీ వరకు కొరాపుట్ నుంచి బయలుదేరాల్సిన ఈ రైలు రాయగడ నుంచి మొదలవుతుంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!