Sai Pallavi : పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో సాయి పల్లవి.. నిత్యా రెడ్డిగా అదరగొట్టింది.. గ్లింప్స్ చూశారా?

Must read

Sai Pallavi : ఇన్నాళ్లు ఎమోషనల్, క్యూట్ పాత్రలతో మెప్పించిన సాయి పల్లవి ఇప్పుడు పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించబోతుంది. ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ఓం సినిమాలో సాయి పల్లవి కీలక పాత్ర పోషిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి సాయి పల్లవి పాత్ర కు సంబంధించిన గ్లింప్స్ ని విడుదల చేసారు.

ఈ గ్లింప్స్ చూస్తుంటే.. ఓ IPS ఆఫీసర్ గా చాలా ఎత్తుకు ఎదిగిన నిత్యారెడ్డి(సాయి పల్లవి) ఎర్రచందనం స్మగ్లర్స్ ని పట్టుకోడానికి స్పెషల్ ఆపరేషన్ కి స్పెషల్ ఆఫీసర్ గా అపాయింట్ చేస్తారని తెలుస్తుంది. ఈ గ్లింప్స్ లో సాయి పల్లవి యాక్షన్, ఎమోషన్ చూపించారు. అలాగే షార్ట్ హెయిర్ తో సరికొత్త లుక్ లో కనిపించబోతుంది. దీంతో సాయి పల్లవి ఈ రేంజ్ లో యాక్షన్ కూడా అదరగొట్టేస్తుంది అని ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఓం సినిమాలో నిత్యారెడ్డి పాత్రలో సాయి పల్లవి గ్లింప్స్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read : Aadarsha Kutumbam : ‘ఆద‌ర్శ‌ కుటుంబం’ టికెట్ రేట్ల పెంపు..

వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్టెక్ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి పార్ట్ నవంబర్ 20న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. రెండు పార్టులుగా ఈ సినిమా రానుంది. శ్రీలీల, మమ్ముట్టి, నసీరుద్దీన్ షా.. పలువురు స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

మీరు కూడా ఓం సినిమా సాయి పల్లవి గ్లింప్స్ చూసేయండి..

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!