School Holidays: ఏపీకి తుఫాను ముప్పు.. నేటి నుంచి స్కూళ్లకు సెలవులు.. అధికారుల కీలక ఆదేశాలు

Must read

School Holidays: తీవ్ర తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అనకాపల్లి జిల్లా యంత్రాంగం అత్యంత అప్రమత్తమైంది. వాతావరణ శాఖ జారీ చేసిన భారీ వర్షాల ముప్పు దృష్ట్యా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటికీ నేటి నుంచి ఈ నెల 29 వరకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు(School Holidays) ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. విపత్తు తీవ్రతను ఎదుర్కొనేందుకు వీలుగా లోతట్టు, సముద్ర తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Essentials Price Hike: సామాన్యుడిపై మరో భారం.. భారీగా పెరుగనున్న సబ్బులు, నూనెల ధరలు.. FMCG కంపెనీల సంచలన నిర్ణయం

24 గంటల కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు.. అధికారులు కేంద్ర స్థానాల్లోనే ఉండాలని ఆదేశం:

ఏర్పడే అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ (NDRF), ఎస్‌డీఆర్‌ఎఫ్‌ (SDRF) బృందాలను సిద్ధంగా ఉంచినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేలా కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల కేంద్రాల్లో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ముందస్తు అనుమతి లేకుండా అధికారులకు సెలవులు మంజూరు చేయవద్దని, సిబ్బంది అంతా తమ తమ హెడ్‌క్వార్టర్స్‌లోనే అందుబాటులో ఉండాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. సముద్రం తీవ్ర అలజడిగా ఉన్నందున మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లవద్దని, ప్రజలంతా అధికారిక యంత్రాంగం సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!