Virat Kohli : న‌వంబ‌ర్ 4 నుంచి న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్.. కోహ్లీ ఎలా సిద్ధం అవుతున్నాడో తెలుసా?

Must read

Virat Kohli : న‌వంబ‌ర్ 4 నుంచి భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ ప్రారంభం కానుంది. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో టెస్టులు, టీ20ల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ వ‌న్డేల్లో మాత్ర‌మే ఆడుతున్న సంగ‌తి తెలిసిందే. కివీస్‌తో వ‌న్డే సిరీస్ కోసం అత‌డు ఇప్ప‌టికే ప్రాక్టీస్ మొద‌లెట్టాడు. ప్ర‌స్తుతం భార‌త్‌లో ఉన్న కోహ్లీ నెట్స్‌లో క‌ఠోర సాధ‌న చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోసం కోహ్లీ త్వ‌ర‌లోనే బ‌య‌లుదేరి వెళ్ల‌నున్నాడు. కివీస్‌తో సిరీస్‌లో అంద‌రి దృష్టి కోహ్లీ పైనే ఉంటుంది అని చెప్ప‌డంలో సందేహం లేదు. ప్ర‌స్తుతం కోహ్లీ భీక‌ర ఫామ్‌లో ఉన్నాడు. విండీస్‌తో వ‌న్డే సిరీస్‌లోనూ ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. కివీస్ గ‌డ్డ‌పైనా ప‌రుగుల వ‌ర‌ద పారించాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. త‌ద్వారా వ‌చ్చే ఏడాది ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌ర‌గ‌నున్న వన్డే ప్ర‌పంచ‌క‌ప్ 2027లో జ‌ట్టులో త‌న స్థానాన్ని ఖాయం చేసుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నారు.

Team India : ఇంగ్లాండ్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో విజ‌యం.. చ‌రిత్ర సృష్టించిన భార‌త్.. టీ20 క్రికెట్‌లో ఏకైక జ‌ట్టుగా.. 200@300..

దక్షిణాఫ్రికాలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీ స్థానం గురించి న్యూజిలాండ్ జట్టు అసిస్టెంట్ కోచ్ జేమ్స్ పామెంట్ త‌న అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు ఎనిమిదేళ్లపాటు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేసిన పామెంట్.. రోహిత్ శర్మతోనూ సన్నిహితంగా పనిచేశాడు. ప్రస్తుతం రోహిత్ భవిష్యత్తుపైనా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

‘అగ్రశ్రేణి ఆటగాళ్ల కెరీర్ ముగింపు దశకు చేరుకుంటున్నప్పుడు వారి భవిష్యత్తుపై చర్చ జరగడం సహజం. ఎప్పుడు ఆటకు దూరం కావాలనే నిర్ణయం తీసుకునే హక్కు వారికే ఉంటుంది. దక్షిణాఫ్రికాలో జరగనున్న వన్డే ప్రపంచకప్ తమ కెరీర్‌లో అత్యంత కీలకమైన టోర్నీ అని వారు భావిస్తే.. అందులో ఆడేందుకు వారికి మద్దతు ఇవ్వాలి. ఆ తర్వాత జట్టుకు వారి ప్రదర్శన, సహకారం ఆధారంగా విషయాలను అంచనా వేయాలి.’ అని పామెంట్ తెలిపాడు.

PAK vs ENG : ఆదివారం అద్భుతం చేసిన పాక్‌.. ఇంగ్లాండ్ పై సంచ‌ల‌న విజ‌యం.. న‌భూతో న‌భ‌విష్య‌త్..!

కోహ్లీతో వ్యక్తిగతంగా ఎక్కువగా కలిసి పనిచేసిన అనుభవం తనకు లేకపోయినా.. న్యూజిలాండ్ జట్టుతో ఉన్నప్పుడు, ముంబై ఇండియన్స్‌తో పనిచేసిన సమయంలో అతడిని నిశితంగా గమనించినట్లు పామెంట్ తెలిపాడు.

‘కోహ్లీ అత్యంత క్రమశిక్షణ కలిగిన ప్రొఫెషనల్ ఆటగాడు. అలాంటి ఆటగాడు ఎప్పుడూ తన జట్టులో ఉండాలని నేను కోరుకుంటాను. ఆట పట్ల అతడికి ఉన్న అంకితభావం అసాధారణం.’ అని కోహ్లీని పామెంట్ ప్రశంసించాడు.

 

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!