Chandrababu-Pawan Kalyan: సీఎం చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్.. స్థానిక పోరుపై అర్ధగంత భేటీ

Must read

Chandrababu-Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో మునుపెన్నడూ లేని విధంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Chandrababu-Pawan Kalyan)ఎటువంటి భద్రతా సిబ్బంది, కాన్వాయ్ లేకుండా అత్యంత సాధారణంగా ఒంటరిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నివాసానికి చేరుకున్నారు. కేవలం తన డ్రైవర్‌తో కలిసి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన పవన్, చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ హఠాత్ పర్యటన, ఇద్దరి అగ్రనేతల భేటీ పొలిటికల్ సర్కిళ్లలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Yanamala Ramakrishnudu: టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడుకు అస్వస్థత.. కాకినాడ ఆస్పత్రికి తరలింపు

స్థానిక పోరు, కోర్టు పరిణామాలు.. కూటమి వ్యూహాలపై అగ్రనేతల కీలక సమాలోచనలు:

సుమారు అర్ధగంట పాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై నేతలిద్దరూ లోతుగా చర్చించారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన ఉత్తర్వులు, రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. దీంతో పాటు త్వరలో రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో కూటమి తరఫున అనుసరించాల్సిన వ్యూహాలు, కొన్ని నియోజకవర్గాల్లో తలెత్తిన రెబల్స్ సమస్యలను ఎలా పరిష్కరించాలనే అంశాలపై చంద్రబాబు, పవన్‌లు సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!