Yanamala Ramakrishnudu: తెలుగుదేశం పార్టీ (తెదేపా) సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు(Yanamala Ramakrishnudu) అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో కాకినాడలోని ప్రముఖ ట్రస్ట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ప్రత్యేక వైద్య బృందం సంరక్షణలో నిరంతర చికిత్స అందిస్తున్నారు. యనమల అనారోగ్యానికి గురైన వార్త తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించి, ఆయన కుటుంబసభ్యులతో పాటు చికిత్స అందిస్తున్న వైద్యులతో ఫోన్లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు.
యనమల ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు ఆరా.. పర్యవేక్షిస్తున్న ఎంపీ సానా సతీశ్:
మాజీ మంత్రి యనమల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం సమీక్షించి, ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేయాలని పార్టీ ముఖ్య నేతలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు తెదేపా ఎంపీ సానా సతీశ్ వెంటనే కాకినాడలోని ఆస్పత్రికి చేరుకుని యనమల ఆరోగ్య పరిస్థితిని, వైద్యుల అందిస్తున్న చికిత్స విధానాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యుల నుంచి సమాచారం అందుతోంది.


