Vivo X300 FE Deal : పండగ ఆఫర్ పిచ్చెక్కిస్తోంది.. వివో X300 FEపై మరి ఇంతనా.. మావా ఈ డీల్ వదలొద్దు..!

Must read

Vivo X300 FE : ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వివో నుంచి X300 FE అద్భుతమైన ఫోన్.. అడ్వాన్స్ కెమెరాలు, పవర్ ఫుల్ ప్రాసెసర్, ఫాస్ట్ ఛార్జింగ్ అందించే ఈ ఫోన్‌పై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్‌లో స్పెషల్ బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా, కొన్ని క్రెడిట్ కార్డులతో పేమెంట్ చేస్తే భారీ మొత్తంలో డబ్బులు ఆదా చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

వివో X300 ఎఫ్ఈ ధర, బ్యాంక్ ఆఫర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ అధికారిక ధర రూ.89,999. అమెజాన్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే రూ.11,400 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ వివో ఫోన్ కొనుగోలుపై ఖర్చు తగ్గుతుంది. బ్యాంక్ నిబంధనలు, ఆఫర్ అర్హతలు, ఈఎంఐ ద్వారా ఇంకా తగ్గుతుంది.

SBI, ICICI లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై ఈఎంఐతో రూ.9,500 వరకు తగ్గింపు పొందవచ్చు. అదనంగా, పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే ఇంకా ఆదా చేసుకోవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ వాల్యూ అనేది పాత ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.

డిస్‌ప్లే, పర్ఫార్మెన్స్ :

వివో X300 ఎఫ్ఈలో 6.31 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను అందించారు. 2640 × 1216 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ కారణంగా వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం, రోజువారీ పనులకు చాలా కంపర్ట్ ఉంటుంది. HDR10+తో పాటు నెట్‌ఫ్లిక్స్ HDR సపోర్ట్ కూడా ఉంది.

Read Also : Post Office Scheme : పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్.. ఇలా డబ్బులు పెట్టారంటే.. నెలకు రూ.9,250 ఆదాయం పక్కా..!

ఈ ఫోన్‌లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్, అడ్రినో 829 జీపీయూ ఉన్నాయి. మల్టీటాస్కింగ్, గ్రాఫిక్స్ ఆధారిత పనులకు సౌకర్యవంతంగా ఉంటుంది. 6,500mAh బ్యాటరీతో పాటు 90W వైర్డ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు.

కెమెరాలు, ఏఐ ఫీచర్లు :
ఫొటోగ్రఫీ కోసం బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా, 8MP వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 50MP కెమెరా అందించారు. ఏఐ ఎరేజ్ ద్వారా ఫొటోల్లో అనవసర వస్తువులను రిమూవ్ చేయొచ్చు. పోర్ట్రెయిట్ ఫొటోలను అప్ గ్రేడ్ చేయడం, సీన్ అనుగుణంగా కెమెరా సెట్టింగులను అడ్జెస్ట్ చేయడం వంటి ఫీచర్లు ఉన్నాయి. స్ట్రీట్ ఫొటోగ్రఫీలో ఏఐ ఆధారిత ఫ్రేమింగ్ అసిస్టెంట్ కూడా ఉంది.

ఈ ఫోన్ కొనొచ్చా? లేదా? :
మంచి ప్రీమియం ఫోన్ కోరుకునేవారికి అద్భుతమైన డిస్‌ప్లే, హై బ్యాటరీ, వైర్‌లెస్ ఛార్జింగ్, మల్టీఫేస్ కెమెరాలతో వివో X300 ఎఫ్ఈ అద్భుతంగా ఉంటుంది. అయితే, కొనుగోలు చేసే ముందు అమెజాన్‌లో ప్రస్తుత ధర, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ వాల్యూ ఎంత ఉంటుందో తెలుసుకోవాలి.

కేవలం డిస్కౌంట్ చూసి కాకుండా, బడ్జెట్‌కు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం బెటర్.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్‌లో వివో X300 ఎఫ్ఈపై రూ.11,400 వరకు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!