Samsung Galaxy A56 Price : సూపర్ ఫోన్ బ్రో.. రూ. 32 వేల లోపే శాంసంగ్ గెలాక్సీ A56 5G మీ సొంతం..!

Must read

Samsung Galaxy A56 Price : ప్రీమియం ఫీచర్లతో అదిరే మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? మీకోసం శాంసంగ్ గెలాక్సీ A56 5జీ అద్భుతమైన ఫోన్ అందుబాటులో ఉంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్‌లో ఈ శాంసంగ్ ఫోన్ ధర భారీగా తగ్గింది.

8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్‌ను ప్రస్తుతం రూ. 31,999కు ఇంటికి తెచ్చుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్‌తో మరింత బెనిఫిట్ పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎ56 ధర, ఫీచర్ల వివరాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

శాంసంగ్ గెలాక్సీ A56 5జీ ధర, బ్యాంక్ ఆఫర్ :
భారత మార్కెట్లో ఈ శాంసంగ్ ఫోన్ ప్రారంభ ధర రూ. 41,999 కాగా, ఆ తర్వాత ధర రూ. 44,999కు చేరింది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 31,999కు అందుబాటులో ఉంది. ప్రస్తుత ధరను బట్టి గరిష్ఠంగా రూ. 13వేల వరకు తగ్గింపు పొందవచ్చు.

Read Also : Vivo X300 FE Deal : పండగ ఆఫర్ పిచ్చెక్కిస్తోంది.. వివో X300 FEపై మరి ఇంతనా.. మావా ఈ డీల్ వదలొద్దు..!

అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనేవారికి రూ. 959 క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. మిడ్‌నైట్, ఆలివ్, వైలెట్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. అయితే, ఆఫర్ల నిబంధనలు, స్టాక్ ఆధారంగా ధరలు మారవచ్చు.

డిస్‌ప్లే, ప్రాసెసర్, బ్యాటరీ వివరాలివే :
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.7 అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో వీడియోలు చూడటం, గేమింగ్ చేయడం అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. ఎక్సినోస్ 1580 ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ, 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కెమెరాలు, సాఫ్ట్‌వేర్ సపోర్ట్ :
ఫొటోగ్రఫీ కోసం బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్, 5MP మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా అందించారు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7తో వచ్చిన ఈ ఫోన్‌కు 6 జనరేషన్ ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను శాంసంగ్ ప్రకటించింది. IP67 రేటింగ్ కూడా ఉంది. బడ్జెట్‌లో మంచి డిస్‌ప్లే, కెమెరాలు, లాంగ్ టైమ్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ కోరుకునేవారికి ఈ డీల్‌ అద్భుతంగా ఉంటుంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!