- 9,000mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్.. అక్టోబర్ 28నే లాంచ్
- గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐక్యూ నియో 12 వచ్చేస్తోంది
- స్నాప్‌డ్రాగన్ పవర్, భారీ బ్యాటరీ.. ఫీచర్లు ఇవే
iQOO Neo 12 Launch : గేమింగ్ ప్రియుల కోసం ఐక్యూ మరో కొత్త ఫోన్‌తో రెడీ అయింది. నెక్స్ట్ జనరేషన్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ ఐక్యూ నియో 12 లాంచ్ తేదీని చైనాలో ప్రకటించింది. లాంచ్ ముందే ఈ ఫోన్ డిజైన్, కలర్ ఆప్షన్లను కూడా కంపెనీ వెల్లడించింది. భారీ బ్యాటరీ, పవర్ఫుల్ ప్రాసెసర్, స్పెషల్ కూలింగ్ సిస్టమ్‌తో ఈ ఐక్యూ ఫోన్ టెక్ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతోంది..
ఐక్యూ నియో 12 లాంచ్ ఎప్పుడంటే? :
అక్టోబర్ 28న చైనాలో ఐక్యూ నియో 12 లాంచ్ కానుంది. లోకల్ టైమ్ ప్రకారం.. రాత్రి 7 గంటలకు, భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు లాంచ్ ఈవెంట్ జరగనుంది. ముగిసిన వెంటనే ఫోన్ సేల్స్ ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం వివో చైనా వెబ్సైట్లో ఈ ఫోన్ ప్రీ-బుకింగ్‌లు అందుబాటులో ఉన్నాయి.
అదిరిపోయే డిజైన్.. 3 కలర్ ఆప్షన్లు :
ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కాంటెస్ట్, షాడో బ్లాక్, ఫ్రాస్ట్ బ్లేడ్ బ్లూ కలర్ ఆప్షన్లలో కంపెనీ తీసుకొస్తోంది. ఇందులో స్పెషల్ టెక్స్చర్డ్ ఫినిషింగ్‌తో బ్యాక్ ప్యానెల్ ఆకట్టుకుంటోంది. ఈ డిజైన్ కోసం చైనా అకాడమీ ఆఫ్ ఆర్ట్‌తో ఐక్యూతో కలిసి పనిచేసింది. ఈ ఫోన్‌కు పాలిష్ చేసిన మెటల్ ఫ్రేమ్‌ను అందించారు.
బ్యాక్ సైడ్ సర్కిల్ కార్నర్లతో రెక్టాంగిల్ కెమెరా మాడ్యూల్, రెండు కెమెరా లెన్స్‌లు, స్పెషల్ ఫ్లాష్ ఉండనున్నాయి. ఫ్రేమ్‌కు రైట్ సైడ్ ఎగ్జాస్ట్ వెంట్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌కు సంబంధించిన లైవ్ ఫొటోలు కూడా ఆన్లైన్లో లీక్ అయ్యాయి.
గేమింగ్ కోసం పవర్ఫుల్ ఫీచర్లు :
ఈ ఫోన్లో క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో పాటు కంపెనీ సొంత క్యూ3 గేమింగ్ చిప్ ఉండనున్నట్లు సమాచారం. గేమింగ్ సమయంలో వేడిని తగ్గించేందుకు ఐస్ డోమ్ యాక్టివ్ కూలింగ్ సిస్టమ్, ఇంటర్నల్ కూలింగ్ ఫ్యాన్‌ను అందించనున్నట్లు వెల్లడైంది..
9,000mAh బ్యాటరీతో వస్తుందా? :
ఐక్యూ నియో 12లో భారీ 9,000mAh బ్యాటరీ, 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండవచ్చు. అయితే, ఈ బ్యాటరీ సామర్థ్యం సహా కొన్ని స్పెసిఫికేషన్లను కంపెనీ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. గత ఏడాది లాంచ్ అయిన ఐక్యూ నియో 11కు అప్‌గ్రేడ్ వెర్షన్ వస్తోంది. ఈ ఫోన్, గేమింగ్ పర్ఫార్మెన్స్, బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అందిస్తుందో తెలియాలంటే అధికారిక లాంచ్ వరకు వేచి చూడాల్సిందే..


