Kim Jong Un: కోమాలో ఉత్తర ‘కొరియా అధ్యక్షుడు’.. కిమ్ జోంగ్ ఉన్ కు బ్రెయిన్ హెమరేజ్‌? చైనాకు తరలింపు!

Must read

Kim Jong Un: ఉత్తర కొరియా గుత్తాధిపత్య పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితిపై అంతర్జాతీయ స్థాయిలో మరోసారి సంచలన ఊహాగానాలు మొదలయ్యాయి. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ పత్రిక ‘ది సన్’ ప్రచురించిన కథనం ప్రకారం, కిమ్ జోంగ్ ఉన్‌కు తీవ్రస్థాయిలో బ్రెయిన్ హెమరేజ్ (మెదడులో రక్తస్రావం) కావడంతో ఆయన కోమాలోకి వెళ్లారని సమాచారం. ప్యోంగ్యాంగ్‌లో సరైన అత్యవసర వైద్య పరికరాలు అందుబాటులో లేకపోవడంతో, ఆయనను రహస్యంగా చైనా రాజధాని బీజింగ్‌లోని పెకింగ్ యూనియన్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. అయితే ఈ వార్తలపై ఉత్తర కొరియా ప్రభుత్వం కానీ, చైనా అధికారిక వర్గాలు కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Sheikh Hasina: నన్ను చంపినా సరే.. బంగ్లాదేశ్ వచ్చి తీరుతా.. భారత్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.. షేక్ హసీనా సంచలన ప్రకటన

అధిక బరువు, లైఫ్‌స్టైలే కారణమా.. నిఘా వర్గాల ఆందోళన:

కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un)చివరగా అక్టోబర్ 11న ప్యోంగ్యాంగ్‌లోని రక్షణ మ్యూజియం సందర్శనలో బహిరంగంగా కనిపించారు. ఆయన తీవ్రమైన ఊబకాయం, అధిక ధూమపానం వల్ల గుండె సంబంధిత సమస్యలు, బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఎక్కువగా ఉందని దక్షిణ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ గతంలోనే అంచనా వేసింది. కిమ్ కుటుంబంలోనూ ఊబకాయం హిస్టరీ ఉంది. గతంలోనూ ఆయన మరణించారంటూ పుకార్లు వచ్చినప్పటికీ, ఈసారి పరిస్థితి విభిన్నంగా ఉందనే ప్రచారం అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

విదేశీ ఆదాయం పెరిగిన వేళ అనూహ్య పరిణామం.. జాతీయ స్థాయిలో ఉత్కంఠ:

రష్యాతో సైనిక ఒప్పందాలు, ఆయుధాలు, సైనికుల సరఫరా ద్వారా గత రెండేళ్లలో ఉత్తర కొరియాకు విదేశాల నుంచి బిలియన్ల కొద్దీ ఆదాయం పెరిగిన సమయంలో ఈ పరిణామం రావడం గమనార్హం. ప్రస్తుతం ప్యోంగ్యాంగ్‌లో లేదా మీడియా ప్రసారాల్లో ప్రజల తీవ్రమైన భావోద్వేగాలు కనిపించకపోయినప్పటికీ, కిమ్ ఆరోగ్యంపై నెలకొన్న సందిగ్ధత ప్రపంచ దేశాల్లో ఉత్కంఠను రేపుతోంది. కిమ్ జోంగ్ ఉన్ బీజింగ్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారా లేదా అనే విషయంపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!