Nagole Accident: నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఘోర ప్రమాదం.. పైప్‌లైన్‌ను ఢీకొట్టిన కారు.. యువకుడు మృతి

Must read

Nagole Accident: హైదరాబాద్‌ నగరం ఉప్పల్ నుంచి నాగోల్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై నాగోల్ మెట్రో స్టేషన్(Nagole Accident) సమీపంలో వేకువజామున సుమారు 3:30 గంటల సమయంలో తీవ్ర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక కారు అదుపుతప్పి జలమండలి ప్రధాన మంచినీటి పైప్‌లైన్ ఎయిర్ వాల్వ్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్, హయత్‌నగర్‌కు చెందిన వినీత్ (24) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఢీకొట్టిన తీవ్రతకు పైప్‌లైన్ వాల్వ్ పూర్తిగా ధ్వంసమై మంచినీరు ఫౌంటెన్‌లా దాదాపు 30 అడుగులకు పైగా ఎగసిపడటంతో ప్రధాన రహదారి జలమయమైంది.

Kim Jong Un: కోమాలో ఉత్తర ‘కొరియా అధ్యక్షుడు’.. కిమ్ జోంగ్ ఉన్ కు బ్రెయిన్ హెమరేజ్‌? చైనాకు తరలింపు!

రంగంలోకి దిగిన జలమండలి, పోలీసులు.. నీటి సరఫరాకు తాత్కాలిక అంతరాయం:

సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు, జలమండలి అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. సుమారు 4 గంటల పాటు నిరంతరాయంగా నీరు ప్రవహించడంతో భారీగా తాగునీరు వృథా కావడంతో పాటు పరిసర ప్రాంతాల్లో రోడ్డు రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది. వెంటనే స్పందించిన జలమండలి సిబ్బంది ప్రధాన వాల్వ్‌ను మూసివేసి అత్యవసర మరమ్మతు పనులు చేపట్టి నీటి ప్రవాహాన్ని అదుపులోకి తెచ్చారు. మరమ్మతుల కారణంగా పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడగా, ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!