JAYAHO RAMANUJA : రామానుజాచార్యుల జీవితగాథతో ‘జయహో రామానుజ’.. రిలీజ్ డేట్ ఫిక్స్‌..

Must read

JAYAHO RAMANUJA : ఆధ్యాత్మిక విప్లవకారుడు, మహా తత్వవేత్త రామానుజాచార్యుల జీవిత విశేషాలతో తెర‌కెక్కుతున్న చిత్రం ‘జయహో రామానుజ’. లయన్ డా. సాయి వెంకట్ హీరోగా నటిస్తూ ఈ చిత్రానికి దర్శకత్వం వ‌హించారు. ఈ చిత్రంలో అమెరికా నటి జో శర్మ కథానాయిక. సీనియర్ నటుడు సుమన్ కీలక పాత్రలో న‌టిస్తున్నారు. సుదర్శనం ప్రొడక్షన్స్‌పై సాయిప్రసన్న, ప్రవళ్లిక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ అప్ డేట్ వ‌చ్చింది.

అక్టోబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకురానున్న‌ట్లు చిత్ర బృందం వెల్ల‌డించింది. ఈ క్ర‌మంలో ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లోనూ వేగం పెంచింది.

చిత్ర ద‌ర్శ‌కుడు సాయి వెంకట్ మాట్లాడుతూ.. సమాజంలో సమానత్వం, మానవత్వం, భక్తి భావాలను చాటిచెప్పిన రామానుజాచార్యుల ఆదర్శాలను నేటి తరానికి పరిచయం చేయడమే ఈ సినిమా ప్రధాన ఉద్దేశమని చెప్పుకొచ్చారు. తన పాతికేళ్ల సినీ ప్రయాణంలో ఈ చిత్రం ప్రత్యేక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. చారిత్రక కథను తెరపై ఆవిష్కరించేందుకు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, పట్టుదలతో చిత్రాన్ని పూర్తి చేసినట్లు వెల్లడించారు.

RC 17 : RC 17లో చిరంజీవి స్పెషల్ రోల్‌?

‘జయహో రామానుజ’లో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉందని సుమన్ తెలిపారు. రామానుజాచార్యుల బోధనలు సమాజ ఐకమత్యానికి మార్గదర్శకమని పేర్కొంటూ, ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమాను చూడాలని కోరారు. నిర్మాత ప్రవళ్లిక కూడా నటిగా తన ప్రతిభను చాటుకుంటున్నారు.

రామానుజాచార్యుల సందేశాన్ని విస్తృత ప్రేక్షకలోకానికి చేరవేయాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!