Annadata Sukhibhava Scheme : ఏపీ రైతులకు పండుగ గిఫ్ట్.. ఖాతాలో ఒకేసారి రూ.6వేలు? అన్నదాత సుఖీభవపై కీలక అప్‌డేట్!

Must read

  • ఏపీ రైతులకు పండుగ గిఫ్ట్.. ఖాతాలోకి ఒకేసారి రూ.6వేలు?
  • అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడంటే?
  • ఏపీ రైతులకు ఏడాదికి రూ.20 వేలు..

Annadata Sukhibhava Scheme : ఆంధ్రప్రదేశ్ రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ పథకం నిధుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు త్వరలోనే శుభవార్త అందనుంది. రాష్ట్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయానికి కేంద్రం పీఎం కిసాన్ నిధులు తోడైతే, అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఒకేసారి రూ.6వేలు జమ కానున్నాయి. అయితే, డబ్బులు విడుదల తేదీపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు రైతులు వేచి చూడాల్సిందే..

ఒకేసారి రూ.6వేలు ఎలా వస్తాయి? :
అన్నదాత సుఖీభవ పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.4వేలు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) కింద కేంద్ర ప్రభుత్వం రూ.2వేలు అందించనుంది. ఈ రెండు విడతల సాయం ఒకేసారి విడుదలైతే అర్హులైన రైతులకు మొత్తం రూ.6వేలు అందుతుంది.

విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ పనుల ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పెట్టుబడి సాయం రైతులకు కొంత ఊరటనివ్వనుంది. ముఖ్యంగా పంటల సాగులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఈ మొత్తం వినియోగించుకోవచ్చు.

Read Also : Ranabaali : రణబాలి అటు ప్రమోషన్స్.. ఇటు ప్రశంసలు!

ఏడాదికి రూ.20వేలు పెట్టుబడి సాయం :
అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.14వేలు కాగా, పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్రం రూ.6వేలు అందించే విధానం అమల్లో ఉంది. ఈ రెండు పథకాల కింద అర్హులైన రైతులకు ఏడాదిలో మొత్తం రూ.20వేల వరకు పెట్టుబడి సాయం లభిస్తుంది. సాధారణంగా ఈ సాయాన్ని విడతల వారీగా అందిస్తారు.

రైతులు ఈ పనులు పూర్తి చేశారా? :
నిధులు ఖాతాలో క్రెడిట్ కావాలంటే రైతులు కొన్ని అంశాలను చెక్ చేయండి

  • ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ పూర్తయిందో లేదో చూడాలి.
  • బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉందో లేదో చెక్ చేయండి.
  • బ్యాంకు ఖాతాకు NPCI మ్యాపింగ్ సరిగా ఉందో లేదో చూడాలి.
  • భూమి రికార్డులు, లబ్ధిదారుల వివరాల్లో తప్పులు లేకుండా చూడాలి.

ఈ వివరాల్లో సమస్యలుంటే రూ. 2వేలు ఇంకా ఆలస్యం కావచ్చు. అవసరమైతే ఫార్మర్ సర్వీసు సెంటర్ లేదా సంబంధిత అధికారులను సంప్రదించాలి.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!