- 25 బంతుల్లో షఫాలీ హాఫ్ సెంచరీ .. 8.5 ఓవర్లలోనే భారత్ ఘన విజయం
- ఫోర్లు, సిక్సర్లతో షఫాలీ దండయాత్ర.. టీమిండియాదే టీ20 సిరీస్
- షఫాలీ 55.. మంధాన 47.. జింబాబ్వేపై భారత్ గ్రాండ్ విక్టరీ
IND-W vs ZIM-W T20 : భారత మహిళల జట్టు మరోసారి తన సత్తా చాటింది. బ్యాటింగ్‌లో షఫాలీ వర్మ విధ్వంసం, స్మృతి మంధాన మెరుపులతో జింబాబ్వే మహిళల జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించింది. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో భారత్ 9 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.
జింబాబ్వేకు భారత బౌలర్ల కళ్లెం :
టాస్ అనంతరం తొలుత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే మహిళల జట్టు భారత బౌలర్ల ధాటికి తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 102 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ.. ప్రత్యర్థి బ్యాటర్లకు స్వేచ్ఛగా పరుగులు చేసే అవకాశం ఇవ్వలేదు. దీంతో భారత్ ముందు 103 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముందుంచింది.
Read Also : Amazon Sale 2026 : రూ.60 వేలలోపు అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ డీల్స్.. వన్‌ప్లస్, ఒప్పో ఫోన్లపై భారీ తగ్గింపులు!
25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. :
103 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధాన ఆరంభం నుంచే జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా షఫాలీ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగింది. కేవలం 25 బంతుల్లోనే 55 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలింగ్‌ను చీల్చిచెండాడింది. ఆమె ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ఉండగా, 220 స్ట్రైక్ రేట్‌తో విధ్వంసకర బ్యాటింగ్ చేసింది.
మరోవైపు స్మృతి మంధాన కూడా ఏమాత్రం తగ్గలేదు. కేవలం 25 బంతుల్లో 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఆమె ఖాతాలో 6 ఫోర్లు, 2 సిక్సర్లు చేరాయి. షఫాలీ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అనుష్క శర్మ 4 బంతుల్లో ఒక పరుగు చేసి నాటౌట్‌గా నిలిచింది.
8.5 ఓవర్లలోనే లక్ష్యం పూర్తి :
భారత్ కేవలం 8.5 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి 104 పరుగులు సాధించింది. 67 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయాన్ని అందుకుంది. తొలి టీ20లోనూ గెలిచిన టీమిండియా, రెండో మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. షఫాలీ విధ్వంసం, మంధాన మెరుపులు భారత విజయాన్ని సాధించాయి.


