- మహాలక్ష్మి పథకంపై ప్రభుత్వం కీలక ఆదేశాలు..
- లబ్ధిదారులకు ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి
- రూ.500 గ్యాస్ సిలిండర్ కోసం ఆధార్ సమర్పించాల్సిందే
Telangana Mahalakshmi Scheme : తెలంగాణలో మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఈ పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ పొందుతున్న లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక సూచన చేసింది.ఇకపై ఈ పథకం ప్రయోజనం పొందాలంటే ఆధార్ వివరాలు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ నంబర్ ఇవ్వడం లేదా ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం లబ్ధిదారులు తమ వివరాలను వెరిఫికేషన్ చేయించుకోవాల్సిందిగా ప్రభుత్వ ఆదేశాలు వెలువడ్డాయి..
పేద, మధ్య తరగతివారికి ఊరట :
మహాలక్ష్మి పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు తక్కువ ధరకే వంట గ్యాస్ అందుతోంది. సాధారణంగా మార్కెట్ ధరకు గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయడం సామాన్య కుటుంబాలకు భారంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రూ.500కే సిలిండర్ అందించే ఈ పథకం ఎంతోమంది కుటుంబాలకు ఊరటనిస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి, పేద కుటుంబాలకు నెలవారీ ఖర్చులు తగ్గించుకోవచ్చు..
అసలు నిర్లక్ష్యం చేయొద్దు :
అయితే, పథకం ప్రయోజనాలు అర్హులైన వారికే అందేలా చూడటంతో పాటు లబ్ధిదారుల వివరాలను ధ్రువీకరించే ప్రక్రియలో భాగంగా ఆధార్ అథెంటికేషన్‌ను తప్పనిసరి చేస్తున్నారు. అందుకే, ఈ పథకం కింద గ్యాస్ సిలిండర్ పొందుతున్న వారు తమ ఆధార్ వివరాల విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. అవసరమైన ఆధార్ నంబర్ లేదా అథెంటికేషన్ వివరాలను సంబంధిత అధికారులకు, గ్యాస్ ఏజెన్సీ సూచనల మేరకు అందించాలి..
ఆధార్ వివరాలు తప్పనిసరి :
ఇప్పటికే ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్న వారు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆధార్ వివరాలు సమర్పించకపోతే పథకం ప్రయోజనం పొందే విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగానే అవసరమైన ప్రక్రియ పూర్తి చేసుకోవడం ఎంతైనా మంచిది..
రూ.500కే గ్యాస్ సిలిండర్ కావాలంటే తెలంగాణ మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు ఆధార్ ఇప్పుడు కీలకంగా మారింది. ప్రభుత్వ సూచనలను పాటించి తమకు అందుతున్న పథకం ప్రయోజనాలు కొనసాగేందుకు అవసరమైన వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.




