నాన్‌వెజ్ ప్రియులకు పండగే.. చికెన్, గుడ్ల ధరలు ఢమాల్.. హైదరాబాద్, విజయవాడలో కొత్త రేట్లు ఇవే..!

Must read

  • నాన్‌వెజ్ ప్రియులకు పండగే..
  • భారీగా పడిపోయిన చికెన్, గుడ్ల ధరలు
  • హైదరాబాద్, విజయవాడలో కొత్త ధరలివే
  • కిలోపై రూ.50 తగ్గింపు.. తాజా ధరలివే

Chicken Prices Today : కార్తీక మాసం వచ్చిందంటే చాలు.. చాలామంది నాన్‌వెజ్‌కు దూరంగా ఉంటారు. పూజలు, వ్రతాలు, అయ్యప్ప దీక్షలు, శివమాల కారణంగా మాంసాహారం తినేవారి సంఖ్య తగ్గిపోతుంది. ఇప్పుడు ఇదే ప్రభావం చికెన్ మార్కెట్‌పై పడింది.

కొనేవాళ్లు తగ్గిపోవడం, మార్కెట్‌లో సరఫరా ఎక్కువగా ఉండటంతో చికెన్ ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. దీంతో నాన్‌వెజ్ ప్రియులకు కాస్త ఊరట లభిస్తోంది.. హైదరాబాద్, విజయవాడలో తాజా చికెన్ ధరలు, గుడ్ల ధరలు ఎలా ఉన్నాయంటే?

గత వారం వరకు కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.300 దాటిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. కానీ, ఇప్పుడు చాలా చోట్ల రూ.250 లోపే లభిస్తోంది. అంటే.. కిలో చికెన్‌పై దాదాపు రూ.50 వరకు తగ్గుదల కనిపిస్తోంది. కోడి గుడ్ల ధరలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి..

హైదరాబాద్‌లో చికెన్, గుడ్ల ధరలివే :
హైదరాబాద్ జోన్‌లో ప్రస్తుతం కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.252గా ఉంది. డ్రెస్డ్ చికెన్ రూ.223కు లభిస్తోంది. రిటైల్ లైవ్ బర్డ్ ధర రూ.144 కాగా, ఫారం దగ్గర లైవ్ బర్డ్ ధర రూ.117గా ఉంది. ఇక గుడ్ల విషయానికి వస్తే.. గతంలో డజన్ రూ.90 వరకు పలికిన ధర ఇప్పుడు రూ.74కు దిగొచ్చింది..

విజయవాడలోనూ తగ్గిన రేట్లు :
విజయవాడలో కూడా చికెన్ ధరలు తగ్గాయి. కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.249గా ఉండగా, డ్రెస్డ్ చికెన్ రూ.220కు విక్రయిస్తున్నారు. రిటైల్ లైవ్ బర్డ్ రూ.142, ఫారం దగ్గర లైవ్ బర్డ్ రూ.115గా ఉంది. డజన్ గుడ్ల ధర రూ.80గా కొనసాగుతోంది.

వచ్చే నెలలో మళ్లీ పెరుగుతాయా? :
ప్రస్తుతం చికెన్ ధరలు తగ్గడంతో నాన్ వెజ్ ప్రియులు సంతోషంగా ఉన్నా.. పౌల్ట్రీ రైతులు, వ్యాపారులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. అయితే, కార్తీక మాసం ముగియడం, క్రిస్మస్ పండుగ దగ్గరపడటంతో వచ్చే నెలలో చికెన్‌కు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే చికెన్ ధరలు మళ్లీ పైకి వెళ్లొచ్చు. మరి ప్రస్తుతం ఉన్న ఈ తక్కువ ధరలు ఇంకెన్ని రోజులు ఉంటాయో చూడాలి..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article