మనుషుల మాట వినని AI.. చివరికి మనల్నే అంతం చేస్తుందా? మాజీ గూగుల్ శాస్త్రవేత్త వార్నింగ్!

Must read

  • ఏఐ విషయంలో జాగ్రత్త..
  • AI చేతిలోకి వెళ్తే మనుషుల భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా?
  • మాజీ గూగుల్ డీప్‌మైండ్‌ సైంటిస్ట్ అలెక్స్ టర్నర్ హెచ్చరిక

AI Takeover All : ఏఐ.. ఏఐ.. ఇప్పుడు ఈ ఏఐనే ప్రపంచాన్ని శాసిస్తోంది.. ప్రతి రంగంలోనూ ఏఐదే కీలక పాత్రగా మారుతోంది.. ఏఐని కనిపెట్టింది మనిషే అయినా అది వారి మనుగడకు ముప్పుగా మారబోతుందా? అసలు నిజంగా ఏఐతో మనిషికి ముప్పు పొంచి ఉందా? ఇప్పుడు ఇదే ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది..

ఏఐతో మానవాళికి ముప్పు తప్పదా? :
టెక్నాలజీ రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతున్న వేళ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి ఓ మాజీ గూగుల్ శాస్త్రవేత్త చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఏఐ భవిష్యత్తులో మనుషుల అదుపు తప్పితే మానవాళి మనుగడకే ప్రమాదం ఏర్పడవచ్చని ఆయన హెచ్చరించారు..

గూగుల్ డీప్‌మైండ్‌లో పనిచేసిన అలెక్స్ టర్నర్.. అడ్వాన్స్ ఏఐ సిస్టమ్స్ అభివృద్ధిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ భద్రత విషయంలో సంస్థ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదనే కారణంతో తాను ఉద్యోగాన్ని వదిలినట్లు ఆయన వెల్లడించారు. తాజాగా పాలిసేడ్ రీసెర్చ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఐ వల్ల ఎదురయ్యే ప్రమాదాల గురించి తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.

జరగబోయేది ఇదేనా?.. :
ప్రస్తుతం చాలా కంపెనీలు కోడింగ్ నుంచి కీలక నిర్ణయాల వరకు ఏఐ సాయం తీసుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు, సైనిక వ్యవస్థలు, ఆర్థిక రంగం కూడా పూర్తిగా ఏఐ ఆధారపడే పరిస్థితి రావచ్చని టర్నర్ అభిప్రాయపడ్డారు. అదే జరిగితే మనుషులకే తమ వ్యవస్థలపై నియంత్రణ తగ్గిపోయే ప్రమాదం ఉందని చెప్పారు..

ముఖ్యంగా ఏఐ సిస్టమ్స్ మనుషులు ఆశించిన విధంగా కాకుండా.. తమకంటూ వేరే లక్ష్యాలతో పనిచేయడం అసలు సమస్య అని ఆయన హెచ్చరించారు. ఈ క్రమంలో ఏఐ తీసుకునే నిర్ణయాలు మానవ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు..

ప్రత్యక్ష ఉదాహరణ ఇదే :
దీనికి ఉదాహరణగా ఓపెన్ఏఐ (OpenAI) ఏజెంట్లు, (Hugging Face)కు సంబంధించిన ఓ ఘటనను ఆయన ప్రస్తావించారు. ఓ టెస్టింగ్ విజయం సాధించేందుకు ఏఐ ఏజెంట్లు అనుకోని మార్గాలను ఎంచుకున్నాయని, ఏఐలోని కంట్రోలింగ్ సమస్యలను తెలియజేస్తోందని వివరించారు..

ఏఐ డెవలప్‌మెంట్ పూర్తిగా ఆపేయాలని కాకపోయినా.. తగిన భద్రతా చర్యలు లేకుండా వేగంగా ముందుకు వెళ్లడం మంచిది కాదన్నది ఆయన అభిప్రాయం. మొత్తానికి ఏఐ మనిషికి అద్భుతమైన సాయంగా మారుతుందా? లేదా భవిష్యత్తులో మనిషికే సవాలుగా నిలుస్తుందా? అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article