ఏపీ బీజేపీలో అసంతృప్తి సెగలు.. తగ్గేది లేదంటున్న నేతలు.. కూటమిలో ఏం జరుగుతోంది..?

Must read

AP Politics : అసహనం.. ఆగ్రహం.. ఏపీ బీజేపీలో అసలేం జరుగుతోంది.? ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌గా మారింది. స్థానిక ఎన్నికల్లో తగిన ప్రాధాన్యం దక్కలేదని ఏపీ బీజేపీ లీడర్లు అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. భీమవరం, జమ్మలమడుగు తర్వాత లేటెస్ట్‌గా జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పదవి విషయంలోనూ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఒకరి తర్వాత మరొకరు..ఏపీ బీజేపీలో అసంతృప్తి బయటపెడుతున్నారు. స్థానిక ఎన్నికల్లో సరైన అవకాశాలు దక్కలేదని.. చాలా మంది కమలనాథులు అసంతృప్తిగా ఉన్నారట.

అయితే కొందరు లీడర్లు మాత్రం ఓపెన్ స్టేట్‌మెంట్లు ఇచ్చేస్తున్నారు. మొన్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ భీమవరంలో తమకు తక్కువ వార్డులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తే..తర్వాత జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కడప జడ్పీ ఛైర్మన్‌ పదవి ఇవ్వలేదని రచ్చ చేశారు. లేటెస్ట్‌గా జీవీఎంసీలో డిప్యూటీ మేయర్ పదవిని బీజేపీకి కేటాయించలేదంటూ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మీడియా ముందే అసహనం వ్యక్తం చేశారు.

రాష్ట్రానికి తమ పార్టీ ఎంతో చేస్తుంది. దానికి మీరు ఎంత చేసినా తక్కువే. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నామ్‌. మీరు మా పార్టీ అభివృద్ధికి సహకరించారా..? అసలు పదవులు ఎలాగూ ఇవ్వడం లేదు..కనీసం కొసరు పదవులు కూడా ఇవ్వకపోతే ఎలా.? అంటూ కమలనాథులు రచ్చకెక్కుతున్నారు. కూటమి ధర్మం కోసం సర్ధుకొని పోతున్నామ్‌‌..తమ కార్యకర్తల ఆవేదనకు విలువ లేదా..? ఏపీ బీజేపీ నేతల నుంచి వస్తున్న మాటలు ఇవే. మాటలు మాత్రమే కాదు కొందరు అసంతృప్తి.. మరికొందరు ఆగ్రహం.. ఇంకొందరు ఏకంగా రాజీనామా అంటూ ప్రకటనలు.. ఇంతకు ఏపీ బీజేపీలో ఏం జరుగుతుందన్న చర్చ హాట్ టాపిక్‌గా మారింది.

అటు పరిషత్ ఫైట్‌, ఫస్ట్ ఫేజ్ పురపోరు అయిపోయే వరకు వరకు సీట్ల సర్ధుబాటులో ఎక్కడా ఇబ్బంది రాకుండా చూసుకున్నారు కూటమి నేతలు. కానీ ఎన్నికల తర్వాత బీజేపీ నేతలు పదవుల పంపకాలపై అసంతృపి వ్యక్తం చేస్తున్నారు. 28 జడ్పీ స్థానాలకు బీజేపీకి ఒక్క కృష్ణా జిల్లా ఛైర్మన్ స్థానం, ఎన్టీఆర్, తిరుపతి వైస్ ఛైర్మన్ స్థానాలు మాత్రమే దక్కాయి. ఇక మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అనంతపురం మేయర్ సీటును కోల్పోగా..2 డిప్యూటీ మేయర్లు, 7 మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవులు దక్కాయి. ఈ కేటాయింపుల్లో తమకు అన్యాయం జరిగిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు..

బీజేపీ నేతల అసంతృప్తి కడప గడప నుంచి మొదలైంది. కడప జడ్పీ స్థానం తన సోదరుడి కుమారుడు రాజేష్‌రెడ్డికి ఇవ్వలేదని అలక పూనారు ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి. నిరసనగా తన సోదరుల కుమారులతో జడ్పీటీసీ స్థానాలకు రాజీనామా చేయిస్తున్నట్లు ప్రకటించారు. అవసరం అయితే తాను రాజీనామా చేస్తానని చెప్పిన ఆయన..ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలుస్తానని చెప్పుకొచ్చారాయన. కేంద్రం నిధులిచ్చి రాష్ట్రానికి అభివృద్ధి చేస్తుంటే కూటమిలో బీజేపీకి ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆది నారాయణ రెడ్డి. ఇక భీమవరం మున్సిపల్ ఛైర్మన్ స్థానం బీజేపీకి ఇవ్వకపోవడంతో పాటు కౌన్సిలర్ సీట్ల కేటాయింపులో ఏకపక్షంగా వ్యవహరించారని ఏకంగా కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ వాయిస్ రేజ్ చేశారు.

కూటమిలో బీజేపీకి అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అయితే వైజాగ్ డిప్యూటీ మేయర్ బీజేపీకి ఇవ్వకపోవడంపై రచ్చకెక్కారు. విశాఖ మేయర్ పదవి ఎలాగూ ఇవ్వలేదు..కనీసం డిప్యూటీ మేయర్ ఇవ్వరా అంటూ నిట్టూర్చారు. కూటమి ధర్మం కోసం సర్దుకుని పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు విష్ణు కుమార్ రాజు. కూటమిలో బీజేపీకి అన్యాయం జరుగుతుందని కామెంట్స్ చేస్తున్నవాళ్లేం చిన్న నేతలు కాదు. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు, ఓ కేంద్రమంత్రి సీరియస్ కామెంట్స్ చేయడంపై పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.

సెకండ్ ఫేజ్ మున్సిపల్ ఎన్నికలు అయిపోయాక సమీక్ష చేసి..సీట్ల షేరింగ్‌లో ఎక్కడ అన్యాయం జరిగిందో ఢిల్లీకి రిపోర్ట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట బీజేపీ రాష్ట్ర నాయకులు. స్థానిక పదవుల పంపకాల పంచాయితీ..ఏపీ బీజేపీ నేతల అసంతృప్తి..ఢిల్లీకి చేరేలా కనిపిస్తోంది. ఈ అసంతృప్తికి చెక్ పెట్టి..కూటమి పార్టీలు ఎలా సర్ధుబాటు చేసుకుంటాయో చూడాలి మరి.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article