Aadarsha Kutumbam : త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’ సినిమా అక్టోబర్ 30న థియేటర్స్ లో రిలీజ్ అయి పర్వాలేదనిపించింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, నివేత పేతురాజ్, సత్య, యువీని పార్థవి, నారా రోహిత్.. పలువురు కీలక పాత్రలో నటించారు.
ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ఆదర్శ కుటుంబం సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో నవంబర్ 27 శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ తన లైబ్రరీలో ఆదర్శ కుటుంబం సినిమాని చూపించింది. మరి ఓటీటీలో ఈ సినిమా ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.
అయితే సినిమాలో వెంకటేష్, నివేత మీద తీసిన మాలా.. అనే బోల్డ్ సాంగ్ ని ఎడిటింగ్ లో కట్ చేసారు. దీంతో థియేటర్లో లేని సాంగ్ ఓటీటీ వర్షన్ లో ఉంటుందా అని ఎదురు చూస్తన్నారు. మరి ఆదర్శ కుటుంబం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఏ వర్షన్ వస్తుందో చూడాలి.
ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వంద కోట్లు లాటరీ తగిలితే దాన్ని దొంగతనం చేసి వీళ్ళని చంపడానికి ఓ దొంగల ముఠా వస్తే ఈ ఫ్యామిలీ ఏం చేసింది? అసలు ఈ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే సస్పెన్స్ క్రైమ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
OFFICIAL ANNOUNCEMENT
![]()
#AdarshaKutumbam House No: 47 – AK47 (Telugu)
Streaming from November 27 on Netflix in Telugu, Tamil, Kannada, Malayalam, Hindi
!!
#OTT_Trackers https://t.co/QmR1pybcth
— OTT Trackers (@OTT_Trackers) November 24, 2026

OFFICIAL ANNOUNCEMENT
!!


