ప్రభుత్వ టీచర్లకు అలర్ట్.. ఇకపై సెలవులన్నీ ఆన్‌లైన్‌లోనే.. తెలంగాణ విద్యాశాఖ డైరెక్టర్ కీలక ఉత్తర్వులు

Must read

Telangana Education Department: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యాశాఖ ఉద్యోగుల సర్వీసు వ్యవహారాల్లో పారదర్శకతను పెంచేందుకు విద్యాశాఖ సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు మాన్యువల్ పద్ధతిలో సాగుతున్న సెలవుల మంజూరు ప్రక్రియకు స్వస్తి పలుకుతూ, పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇకపై ఉపాధ్యాయులు, సిబ్బంది తమ సెలవుల దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే సమర్పించాల్సి ఉండగా, అధికారులు సైతం డిజిటల్ విధానంలోనే వాటిని పరిశీలించి ఆమోదించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తాజాగా స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు.

Hyderabad Traffic: హైదరాబాద్‌లో ‘ట్రాఫిక్ రద్దీ ఛార్జీలు’.. ఇకపై కారులో ఒక్కరే వెళ్తే ఫైన్?.. ఐటీ కారిడార్‌లోనే తొలి అడుగు

IFMIS పోర్టల్‌లోని EHRMS మాడ్యూల్ ద్వారా సేవలు:

ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (IFMIS) పోర్టల్‌లోని ‘EHRMS’ మాడ్యూల్ ద్వారా ఈ సెలవుల మంజూరు ప్రక్రియను చేపట్టాలని విద్యాశాఖ(Telangana Education Department) ఆదేశించింది. కేవలం సెలవులకే పరిమితం కాకుండా, ఉద్యోగుల వార్షిక వేతన పెంపు (ఇంక్రిమెంట్లు), ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPGF) వ్యవహారాలు, ఈ-పెన్షన్ (e-Pension) వంటి కీలక సర్వీసు సేవలన్నింటినీ ఇదే పోర్టల్ ద్వారా ప్రాసెస్ చేయాలని స్పష్టం చేసింది.

ఫైళ్ల జాప్యానికి చెక్.. ఒకే వేదికపై సమస్త సమాచారం:

ఈ నూతన డిజిటల్ విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే ఉపాధ్యాయులు, ఉద్యోగుల సర్వీసు రికార్డుల నిర్వహణ అత్యంత సులభతరం కానుంది. దరఖాస్తుల స్థితిగతులు, ఫైళ్ల కదలికలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పర్యవేక్షించే వీలుండటంతో అనవసర జాప్యానికి, అవినీతికి అడ్డుకట్ట పడనుంది. ఈ నేపథ్యంలో టీచర్లు, ఉద్యోగులందరూ IFMIS పోర్టల్‌లోని EHRMS మాడ్యూల్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article