సింహాచలం అప్పన్న ఆలయంలో కొత్త డ్రెస్ కోడ్ రూల్స్.. పురుషులు, మహిళలు ఏం వేసుకోవాలంటే?

Must read

  • సింహాచలం అప్పన్న దర్శనానికి వెళ్తున్నారా?
  • డిసెంబర్ 1 నుంచి కొత్త డ్రెస్ కోడ్ అమలు
  • పురుషులు, మహిళలు ఏం వేసుకోవాలంటే?

Simhachalam Temple Dress Code : సింహాచలం అప్పన్న స్వామి దర్శనానికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్న భక్తులకు ఆలయ అధికారులు కీలక సమాచారం అందించారు. ఇకపై ఆలయానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించడం తప్పనిసరి కానుంది.

డిసెంబర్ 1, 2026 నుంచి ఈ కొత్త డ్రెస్ కోడ్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం నిర్ణయించింది. స్వామివారి దర్శనానికి వచ్చే వారితో పాటు ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు కూడా ఈ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది..

పురుషులు, మహిళలకు ప్రత్యేక డ్రెస్ కోడ్ :
ఆలయ ఈవో జె. వెంకటరావు నవంబర్ 21న విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. పురుష భక్తులు ధోతి, అంగవస్త్రం ధరించవచ్చు. లేదంటే కుర్తా పైజామా లేదా ఆలయ నిబంధనలకు అనుగుణంగా ఉండే ఫార్మల్ షర్ట్, ట్రౌజర్స్ వేసుకోవచ్చు..

మహిళా భక్తులు చీరలు, లంగా వోణీలు ధరించవచ్చు. అలాగే చున్నీతో కూడిన చుడీదార్లకు కూడా అనుమతి ఉంటుంది. అయితే షార్ట్స్, టీ షర్ట్స్, స్లీవ్‌లెస్ టాప్స్ వంటి సంప్రదాయానికి విరుద్ధమైన దుస్తులకు అనుమతి ఉండదని ఆలయ అధికారులు స్పష్టం చేశారు.

భక్తులకు అవగాహన కల్పిస్తున్న ఆలయ అధికారులు :
కొత్త నిబంధనలు అమల్లోకి రాకముందే భక్తులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను ఆలయ యంత్రాంగం ప్రారంభించింది. ఆలయ ప్రాంగణంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో డ్రెస్ కోడ్ వివరాలను తెలియజేసే బోర్డులను ఏర్పాటు చేశారు. భక్తులు ముందుగానే ఈ నిబంధనల గురించి తెలుసుకుని దర్శనానికి రావాలన్నది అధికారుల ఉద్దేశం..

సింహాచలం క్షేత్ర పవిత్రతను కాపాడటంతో పాటు, ఆలయ ఆధ్యాత్మిక ప్రాధాన్యతను నిలబెట్టడం, సంప్రదాయ హిందూ ఆచార వ్యవహారాలను పరిరక్షించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని ఈవో తెలిపారు. కాబట్టి అప్పన్న దర్శనానికి వెళ్లే భక్తులు డిసెంబర్ 1 నుంచి ఈ డ్రెస్ కోడ్‌ను గుర్తుంచుకోవడం మంచిది..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article