మహిళలకు గుడ్‌న్యూస్.. ఇందిరమ్మ చీరలు వచ్చేస్తున్నాయ్.. కలర్, డిజైన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Must read

  • రేషన్ కార్డు ఉన్న మహిళలకు శుభవార్త..
  • కోటి ఇందిరమ్మ చీరల పంపిణీకి ముహూర్తం ఫిక్స్
  • ఇందిరమ్మ చీరల పంపిణీ ఎప్పుడంటే?

Indiramma Sarees Distribution : తెలంగాణలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తీపి కబురు చెప్పనుంది. ఆడబిడ్డలకు ప్రత్యేక కానుకగా అందించే ఇందిరమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు కోటి చీరలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ నెల 26న నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఇందిరమ్మ చీరలు ఎలా ఉంటాయంటే? :
ఈసారి ఇందిరమ్మ చీరలు ఎలా ఉండబోతున్నాయో తెలుసా? మహిళల అభిరుచులకు తగ్గట్టుగా ఆకర్షణీయమైన చిలుకపచ్చ రంగులో వీటిని ప్రత్యేకంగా తయారు చేయించారు. చూడటానికి అందంగా ఉండటంతో పాటు రోజూ వాడుకునేందుకు వీలుగా నాణ్యత, మన్నికకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆధునిక డిజైన్లతో పాటు సంప్రదాయ పద్ధతిలో కట్టుకునే మహిళల కోసం కూడా ప్రత్యేకంగా చీరలను సిద్ధం చేశారు.

Read Also : Harish Rao : కేసీఆర్‌ను ఉరితీయాలా? ఉరే వెయ్యాల్సి వస్తే రేవంత్ రెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డికి వెయ్యాలి.. హరీష్ రావు ఫైర్

ఈ పంపిణీలో భాగంగా 6.30 మీటర్ల పొడవున్న 95 లక్షల పాలిస్టర్ చీరలు, 9 మీటర్ల పొడవున్న 5 లక్షల పాలీకాటన్ చీరలను అందించనున్నారు. అంటే.. మహిళల అవసరాలు, అభిరుచులను దృష్టిలో పెట్టుకుని రెండు రకాల చీరలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

మరో విశేషం ఏంటంటే.. :
ఈ చీరల తయారీ బాధ్యతను ఇతర ప్రాంతాల వారికి కాకుండా తెలంగాణలోని స్థానిక నేత కార్మికులకే అప్పగించారు. దీంతో మహిళలకు కానుక అందించడంతో పాటు మన నేతన్నలకు కూడా చేతినిండా పని కల్పించినట్లయింది..

ఇక అర్హత విషయానికి వస్తే..
రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన మహిళలు ఈ చీరలను పొందేందుకు అర్హులు. గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల మందికి, పట్టణ ప్రాంతాల్లో 35 లక్షల మందికి వీటిని పంపిణీ చేయనున్నారు.

గ్రామాలు, పట్టణాల్లో వార్డుల వారీగా సెర్ప్ సిబ్బంది ద్వారా చీరలు అందిస్తారు. అర్హులైన మహిళలు ఆహార భద్రత కార్డు, ఆధార్ వివరాలను చూపించాల్సి ఉంటుంది. ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా లబ్ధిదారుల వివరాలు నమోదు చేయనున్నారు. మొత్తానికి ఈసారి ఇందిరమ్మ చీరల పంపిణీతో రాష్ట్రంలోని మహిళల ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొననుంది..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article