Gold Silver Prices Today: పెళ్లిళ్ల సీజన్ వేళ బంగారం కొనుగోలుదారులకు పసిడి ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకుల ప్రభావంతో దేశీయ బులియన్ మార్కెట్లో నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజా గణాంకాల ప్రకారం, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం గ్రాముకి రూ.12,780 చొప్పున, 10 గ్రాముల (తులం) ధర రూ.124 పెరిగి రూ.1,27,800 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం గ్రాముకి రూ.11,715 చొప్పున, తులం ధర రూ.115 పెరిగి రూ.1,17,150కి చేరుకుంది. మరోవైపు వెండి ధర కూడా స్థిరంగా ఉంటూ కిలో రూ.1,75,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే:
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో పసిడి ధరలు (Gold Silver Prices Today)దాదాపు ఒకే విధంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,26,570 నుంచి రూ.1,27,800 మధ్య ఉండగా, 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,16,010 నుంచి రూ.1,17,150 పరిధిలో విక్రయిస్తున్నారు. స్థానిక పన్నులు, జ్యువెలరీ షాపుల తయారీ ఛార్జీలను బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి రేట్లు:
దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాల్లోనూ బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం రూ.1,27,950 వద్ద ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,17,300గా ఉంది. ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,26,570 నుంచి రూ.1,27,800 మధ్య కొనసాగుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,16,010 నుంచి రూ.1,17,150 మధ్య నమోదైంది. రానున్న రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలను బట్టి ధరల్లో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.




