బెట్టింగ్ ఊబిలో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి.. అప్పుల బాధతో హాస్టల్ గదిలో ఉరి.. కన్నీరుమున్నీరవుతున్న తల్లి!

Must read

Basara IIIT Tragedy: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల మాయాజాలం మరో ప్రతిభావంతుడైన విద్యార్థి నిండు ప్రాణాన్ని బలిగొంది. బాసర ట్రిపుల్ ఐటీలో ఉచిత సీటు సాధించి, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్న సంపత్ అనే విద్యార్థి బెట్టింగ్ (Basara IIIT Tragedy)ఊబిలో చిక్కుకుని అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తోటి విద్యార్థులతో కలిసి ఆన్‌లైన్‌లో బెట్టింగ్ ఆడిన సంపత్ భారీగా డబ్బులు పోగొట్టుకుని తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో, డ్రైవర్‌గా పనిచేస్తున్న అతని అన్న వెంటనే స్పందించి రూ.50 వేలు ఫోన్ పే ద్వారా పంపించాడు. అయినప్పటికీ, మిగిలిన అప్పులను ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన సంపత్, హాస్టల్ గదిలోనే ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Gold Spot Re Launch: 90’s కిడ్స్ ఫేవరెట్ డ్రింక్.. 26 ఏళ్ల తర్వాత ‘గోల్డ్ స్పాట్’ రీఎంట్రీ.. బ్రాండ్ అంబాసిడర్‌గా ధోనీ?

తల్లి ఆశలన్నీ ఆవిరి:

చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన సంపత్‌ను, అతని అన్నను తల్లి ఎంతో కష్టపడి కూలి పనిచేస్తూ చదివించింది. చదువుల్లో ఎప్పుడూ టాపర్‌గా ఉండే సంపత్, బాసర ట్రిపుల్ ఐటీలో ఫ్రీ సీటు సాధించడంతో తమ కష్టాలన్నీ తీరిపోతాయని ఆ తల్లి ఎన్నో ఆశలు పెట్టుకుంది. కొడుకు ప్రయోజకుడై అండగా నిలుస్తాడని కలలు కన్న ఆ పేద తల్లికి, బెట్టింగ్ యాప్‌ల కారణంగా తీరని శోకం మిగిలింది.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article