నలుగురు హీరోలలో ముగ్గురు ముగ్గురు స్టార్ డైరెక్టర్స్ తో వర్క్ చేసినట్టు క్లైమాక్స్ లో చూపించారు. విశ్వక్ ని అయితే అలా చూపించలేదు. దీనిపై సక్సెస్ ఈవెంట్లో దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. విశ్వక్ సేన్ తో రామ్ గోపాల్ వర్మ సర్ చేయాలి. మేము మాట్లాడాము కూడా. కానీ సెన్సార్ కి 15 రోజుల ముందే సబ్మిషన్ ఇవ్వాలని చెప్పడంతో డేట్స్ ఇష్యూస్ వాళ్ళ ఆర్జీవీ సర్ కి కుదర్లేదు. లేకపోతే ఆర్జీవీ క్యామియో కూడా ఉండేది అని అన్నారు.
దీంతో ఆర్జీవీ ఫ్యాన్స్, ఈ నగరానికి ఏమైంది ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఆర్జీవీ కూడా ఉండుంటే సినిమా వేరే లెవల్ కి వెళ్ళేది అని అంటున్నారు. ఇంతమంది దర్శకులతో పాటు ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్, సింగర్ శ్రీరామచంద్ర, రాజీవ్ కనకాల కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. విజయ్ దేవరకొండని కూడా గెస్ట్ గా ట్రై చేసారు కానీ కుదర్లేదు.

