- కెనడా వాల్‌మార్ట్ పార్కింగ్‌లో కాల్పుల కలకలం..
- షాపింగ్‌కు వెళ్లిన భారతీయ జంట దారుణ హత్య
- వాల్‌మార్ట్‌కు వెళ్లిన ప్రేమజంటపై బుల్లెట్ల వర్షం
- ఇంటి నుంచి వెళ్లిన కొద్దిసేపటికే విషాదం..
ఎవరీ మృతులు? :
మృతులను డెల్టా ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల గగన్‌ప్రీత్ (గ్యారీ) రెహల్, 24 ఏళ్ల సుఖ్‌జీత్ కౌర్‌గా గుర్తించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. గగన్‌ప్రీత్ గతంలో ఆయుధాలకు సంబంధించిన నేరాల విషయంలో పోలీసులకు పరిచయమున్న వ్యక్తి.. ఈ దాడి యాదృచ్ఛికంగా జరిగింది కాదని, ముందస్తు ప్రణాళికతో లక్ష్యంగా చేసుకుని హత్య చేసి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
కాల్పుల తర్వాత కారుకు నిప్పు :
ఈ ఘటనలో కాల్పులు జరిగిన 15 నిమిషాలకే ప్రిన్సెస్ డ్రైవ్‌లోని 9700 బ్లాక్‌లో ఓ కారు మంటల్లో కాలిపోయింది. ఈ వాహనానికి కాల్పుల ఘటనతో సంబంధం ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కొడుకును కోల్పోయిన తండ్రి కన్నీరు :
కుమారుడి మరణవార్త విన్న గగన్‌ప్రీత్ తండ్రి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చివరిసారిగా తన కొడుకును చూడాలనుకుంటున్నానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అందరినీ కలచివేస్తున్నాయి. ప్రస్తుతం IHIT, సర్రే పోలీసులు సంయుక్తంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యల వెనుక అసలు కారణమేంటి? దుండగులు ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది.

