Homeటెక్నాలజీBSNL బంపర్ ఆఫర్.. రూ.2,449కే 380 రోజుల వ్యాలిడిటీ, 760GB డేటా, రూ. లక్ష ఇన్సూరెన్స్..!

BSNL బంపర్ ఆఫర్.. రూ.2,449కే 380 రోజుల వ్యాలిడిటీ, 760GB డేటా, రూ. లక్ష ఇన్సూరెన్స్..!

  • ఏడాది దాటినా రీఛార్జ్ టెన్షన్ లేదు..
  • BSNL ప్లాన్‌లో రూ.లక్ష బీమా కూడా
  • రోజుకు 2GB డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్
  • 380 రోజులు ఫ్రీ కాల్స్, డేటా, సైబర్ బీమా

రూ.లక్ష ప్రమాద బీమా.. రూ.10 వేల సైబర్ కవరేజ్ :
ఈ ప్లాన్‌లో ఇన్సూరెన్స్ అనేది అందరిని ఆకట్టుకుంటోంది. అర్హతలు, నిబంధనలకు లోబడి రూ.1 లక్ష వరకు ప్రమాద బీమా కవరేజీ అందిస్తుంది. రోడ్డు ప్రమాదాలు, కాలిన గాయాలు, పాము కాటు, పిడుగుపాటు, విద్యుదాఘాతం వంటి ప్రమాదాలకు ఈ కవరేజ్ వర్తిస్తుంది. అంతేకాదు.. సైబర్ మోసాల నుంచి ప్రొటెక్షన్ కల్పించేందుకు రూ.10వేల వరకు సైబర్ ఇన్సూరెన్స్ కూడా అందిస్తుంది.

రీఛార్జ్ చేసే ముందు ఇవి తెలుసుకోండి :
ధర తక్కువగా ఉండటంతో పాటు ఎక్కువ వ్యాలిడిటీ, డేటా బెనిఫిట్స్ పొందవచ్చు. అయితే, ఇన్సూరెన్స్‌కు సంబంధించిన అర్హతలు, క్లెయిమ్ విధానం, కవరేజ్ నిబంధనలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.

అలాగే ఫ్రీ ఇంటర్నేషనల్ రోమింగ్ బెనిఫిట్స్, షరతులను కూడా బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్‌సైట్ లేదా కస్టమర్ కేర్ ద్వారా చెక్ చేసుకోండి. మొత్తానికి ఏడాదికి ఒకేసారి రీఛార్జ్ చేసుకోవాలనుకునే వారికి బీఎస్ఎన్ఎల్ రూ.2,449 ప్లాన్ అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు..

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments