- టోల్ ప్లాజా దగ్గర ఉంటున్నారా?
- నెలనెలా డబ్బులు కట్టే పని లేదు
- రూ.1,500కే ఏడాది పాస్ తీసుకోవచ్చు
ఎవరికి ఈ అవకాశం అంటే? :
టోల్ ప్లాజా నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే స్థానికులకు ఈ పాస్ వర్తిస్తుంది. అయితే, ఇది వ్యక్తిగత కార్లకు మాత్రమే వర్తిస్తుంది. వాణిజ్య వాహనాలకు ఈ సదుపాయం ఉండదు. స్థానికంగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ ప్రతిరోజూ కార్లపై ప్రయాణించే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
యాప్‌లోనే పాస్ పొందొచ్చు :
ఈ పాస్ కోసం టోల్ ప్లాజా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. రాజ్‌మార్గ్‌యాత్ర (Rajmargyatra) యాప్ ద్వారా ఆన్‌లైన్‌లోనే అప్లయ్ చేసుకోవచ్చు. అడ్రస్, ఫాస్టాగ్ వివరాలు రిజిస్టర్ చేస్తే జీపీఎస్ ఆధారిత ప్రాంత పరిశీలన ద్వారా అర్హతను నిర్ధారిస్తారు. కారు ఆర్‌సీ, ఆధార్, ఓటర్ కార్డుల్లో అడ్రస్ ఒకేలా ఉండాలి.
ముఖ్యంగా నెలవారీ పాస్ తీసుకునేవారు నెల మొదటి తేదీనే రెన్యూవల్ చేసుకోవడం బెటర్.. ఎందుకంటే నెల మధ్యలో తీసుకున్నా ఆ నెల చివరి వరకే పనిచేస్తుంది. అదే వార్షిక పాస్ తీసుకుంటే ఏడాది పాటు నిశ్చింతగా ప్రయాణించవచ్చు. అర్హత ఉన్న స్థానిక వాహనదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు..

