- 6,500mAh బ్యాటరీతో Vivo కొత్త ఫోన్ వస్తోంది
- 120Hz డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో రానుంది
- వివో Y05s ఫీచర్లు, ధరపై ఓ లుక్కేయండి
కెమెరాల విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ 8MP కెమెరా, సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 5MP కెమెరా ఉండొచ్చని అంచనా.. ఇక ఈ ఫోన్‌లో 6,500mAh భారీ బ్యాటరీ స్పెషల్ అట్రాక్షన్.. దీనికి 15W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండొచ్చు.. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆర్జిన్ఓఎస్ 6తో పాటు మిడ్ నైట్ బ్లూ, చాంపియన్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రావొచ్చని తెలుస్తోంది..
వివో Y05 కొనాలా? వివో Y05s కోసం ఆగాలా? :
ప్రస్తుతం భారత్‌లో వివో Y05 సుమారు రూ.14,999 నుంచి రూ.15,999 ధరల మధ్య అందుబాటులో ఉంది. భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, IP65 రేటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే, కెమెరాలు, ప్రాసెసింగ్ పరంగా బేసిక్ అవసరాలకు మాత్రమే సరిపోతుంది. అందులో ఫోన్ కాల్స్, వాట్సాప్, సోషల్ మీడియా, వీడియోలు చూసేందుకు ఈ ఫోన్ బెటర్.. గేమింగ్, ఫొటోగ్రఫీ చేసేవారికి మాత్రం పెద్దగా నచ్చకపోవచ్చు.
మరి ఏది బెస్ట్? :
ప్రాసెసర్, కెమెరా అప్‌గ్రేడ్ కావాలంటే వివో వి05s ఫోన్ కోసం వెయిట్ చేయొచ్చు. లేదంటే ప్రస్తుతం వివో Y05 కొనడం బెస్ట్ ఆప్షన్.. అయితే, వివో Y05s ధర, ఫీచర్లపై వివో అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే..

