- ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..
- ప్రతి ఇంటిపై సోలార్ విద్యుత్ దిశగా చంద్రబాబు అడుగులు
- కరెంట్ బిల్లులకు చెక్ పెట్టే ప్లాన్..
- 9 లక్షల సోలార్ కనెక్షన్లే టార్గెట్
224 ప్రాంతాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు :
మరోవైపు.. వ్యవసాయ రంగంలోనూ సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. పీఎం కుసుమ్ పథకం కింద 224 ప్రాంతాల్లో 1,162 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్ల పనులు కొనసాగుతున్నాయి. వీటికి సంబంధించిన భూసేకరణ పూర్తవగా, సివిల్ పనులు కూడా 91 శాతం వరకు పూర్తయ్యాయి.
ఇక రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని గ్రీన్ ఎనర్జీ కారిడార్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వచ్చే 6 నెలల్లో విద్యుత్ డిమాండ్ 14,852 మెగావాట్లకు చేరొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు..
2,962 విద్యాసంస్థల ఎంపిక.. :
అంతేకాదు.. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలోనూ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం 2,962 విద్యాసంస్థలను ఎంపిక చేసే ప్రణాళిక ఉంది. మొత్తానికి ఇళ్ల నుంచి విద్యాసంస్థల వరకు సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది..


