- మేఘా ఇంజినీరింగ్‌కు రూ.లక్ష కోట్ల విలువ..
- అంతర్జాతీయ ఇన్వెస్టర్ల భారీ పెట్టుబడులు
- మేఘా గ్రూప్‌లోకి విదేశీ పెట్టుబడులు..
- ఈపీటీఎల్ విలువ రూ.14 వేల కోట్లు
ఈపీటీఎల్ రూ.14 వేల కోట్లు :
మరోవైపు గ్రూపునకు చెందిన ఎనర్జీ ట్రాన్సిషన్ సంస్థ ఈపీటీఎల్ (EPTL) విలువను సుమారు రూ.14 వేల కోట్లుగా అంచనా వేసినట్లు సమాచారం.. భవిష్యత్తులో పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ నిల్వ రంగాల్లో పెరగనున్న అవకాశాలు ఈ సంస్థకు మరింత ప్రాధాన్యం తీసుకొస్తున్నాయి..
20కిపైగా దేశాల్లో ప్రాజెక్టుల విస్తరణ :
దాదాపు 3 దశాబ్దాలుగా మౌలిక సదుపాయాల రంగంలో పనిచేస్తున్న మేఘా గ్రూప్.. ప్రస్తుతం 20కిపైగా దేశాల్లో తన ప్రాజెక్టులను విస్తరించింది. నీటిపారుదల, రహదారులు, సొరంగ మార్గాలు, విద్యుత్, చమురు-వాయువు, తయారీ రంగాల్లో కీలక ప్రాజెక్టులు చేపడుతోంది. దేశంలోని పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లోనూ భాగస్వామిగా ఉంది..
కొత్త రంగాల్లోనూ అడుగులు :
ఇక సంప్రదాయ వ్యాపారాలతో పాటు సౌర విద్యుత్, పంప్డ్ స్టోరేజ్, అణు విద్యుత్, ఎలక్ట్రిక్ బస్సులు, గ్యాస్ పంపిణీ వంటి కొత్త రంగాల్లోనూ అడుగులు వేస్తోంది. మౌలిక సదుపాయాల నుంచి ఇంధన రంగం వరకు విస్తరిస్తున్న మేఘా గ్రూప్‌కు అంతర్జాతీయ పెట్టుబడుల రాక కొత్త అవకాశాలకు బాటలు వేస్తోంది. భారత అభివృద్ధి ప్రయాణంలో దేశీయ సంస్థలకు ప్రపంచ స్థాయి గుర్తింపు పెరుగుతోంది.


