భారత రోడ్లపై హీరో తొలి ఎలక్ట్రిక్ బైక్ టెస్టింగ్.. విడా UBX 06 వచ్చేస్తోంది.. ఫీచర్లు మాత్రం కిర్రాక్..!

Must read

  • భారత రోడ్లపై హీరో తొలి ఎలక్ట్రిక్ బైక్ టెస్టింగ్
  • ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్‌లోకి హీరో ఎంట్రీ..
  • అదిరిపోయే లుక్‌తో విడా యూబీఎక్స్ 06..
  • సూపర్‌మోటో స్టైల్‌లో హీరో ఎలక్ట్రిక్ బైక్..

ఫ్రంట్ సైడ్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, చుట్టూ వ్యూఫైండర్ ఆకారంలో ఎల్ఈడీ డీఆర్ఎల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. భారీ ఎఫ్టీ డిస్‌ప్లే, లెఫ్ట్ సైడ్ హ్యాండిల్‌పై కంట్రోల్ స్విచ్‌లు, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఇందులో కనిపిస్తున్నాయి. అయితే, ఎఐసీఎంఎ మోడల్‌లో ఉన్న నకిల్ గార్డ్స్ టెస్ట్ బైక్‌లో కనిపించలేదు..

హార్డ్‌వేర్ విషయానికి వస్తే.. :
ఫ్రంట్, బ్యాక్ డిస్క్ బ్రేకులు, యూఎస్‌డీ ఫ్రంట్ ఫోర్కులు, బ్యాక్ మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. సింగిల్ ఛానల్ ఏబీఎస్ కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ బైక్‌లో పెద్ద ఫిక్స్‌డ్ బ్యాటరీ ప్యాక్, మిడ్ డ్రైవ్ మోటార్ ఉండనున్నాయి. సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్లలో కనిపించే హబ్ మోటార్‌కు భిన్నంగా, ఇందులో చైన్ డ్రైవ్ ద్వారా వెనుక చక్రానికి పవర్ అందుతుంది.

అయితే, బ్యాటరీ సామర్థ్యం, మోటార్ పవర్, రేంజ్, ఛార్జింగ్ వివరాలను కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు.. ప్రస్తుత అంచనాల ప్రకారం.. 2027 మధ్యలో భారత మార్కెట్లో విడా యూబీఎక్స్ 06 లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ధర, పూర్తి వివరాలపై కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!