స్మార్ట్‌ఫోన్ కొనేవారికి బిగ్ షాక్.. భారీగా పెరిగిన శాంసంగ్, షావోమీ ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంతంటే?

Must read

  • శాంసంగ్, షావోమీ యూజర్లకు బ్యాడ్ న్యూస్..
  • షావోమీ, శాంసంగ్ ఫోన్ల ధరలు రూ.4 వేల వరకు పెంపు
  • మొబైల్ మార్కెట్‌లో ధరల మంటలు
  • రెడ్‌మీ, గెలాక్సీ ఫోన్ల ధరలు పెరిగాయి

షావోమీ, రెడ్‌మి ఫోన్ల కొత్త ధరలివే :
షావోమీ, రెడ్‌మి పోర్ట్‌ఫోలియోలోని 19 వేరియంట్ల ధరలను పెంచింది. ఈ పెంపు 4.26 శాతం నుంచి 18.75 శాతం వరకు ఉంది. రెడ్‌మి A7 4GB + 64GB మోడల్ ధర రూ.13వేల నుంచి రూ.15వేలకు చేరింది. రెడ్‌మి A7 ప్రో ధర రూ.14వేల నుంచి రూ.16వేలు అయింది.

రెడ్‌మీ నోట్ 17 5జీ ప్రారంభ ధర రూ.28వేల నుంచి రూ.31వేలకు పెరిగింది. నోట్ 17 ప్రో 5జీ వేరియంట్లపై రూ.4వేల పెంపు నమోదైంది. ప్రో మ్యాక్స్ మోడళ్ల ధరలు రూ.3వేలు పెరిగాయి. ఈ ధరల పెరుగుదలకు మెమరీ చిప్స్, ఇతర స్పేర్ పార్టుల ఖర్చులు పెరగడం ప్రధాన కారణంగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు వివో, ఒప్పో, మోటరోలా, రియల్‌మి కూడా తమ ఫోన్ల ధరలను పెంచనున్నాయి.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!