- నవంబర్ ఆఫర్ల లిస్టులో డస్టర్ టాప్ ప్లేసు
- రెనాల్ట్ క్విడ్ కారుపై రూ. 40వేల వరకు ఆదా
- పాత కారు ఎక్స్ఛేంజ్ రూ. 1.50 లక్షల బెనిఫిట్స్
రెనాల్ట్ కైగర్ డిస్కౌంట్ ఆఫర్లు :
మీరు తక్కువ ధరలో ఒక SUV కొనాలని చూస్తుంటే.. రెనాల్ట్ కైగర్ అదిరిపోయే ఆప్షన్. ఈ కారుపై కంపెనీ రూ. 65వేల వరకు విలువైన బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో రూ. 25వేల వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 25వేల వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాప్ బోనస్ ఉన్నాయి. ఈ ఆఫర్లు ఎవల్యూషన్+, టెక్నో, ఎమోషన్ వేరియంట్లకు వర్తిస్తాయి.
పాత రెనాల్ట్ కస్టమర్లు రూ. 10వేల వరకు లాయల్టీ బోనస్‌ను పొందవచ్చు. కార్పొరేట్ కస్టమర్లకు రూ. 5వేల వరకు, గ్రామీణ కస్టమర్లకు రూ. 4వేల వరకు అదనపు బెనిఫిట్స్ కూడా అందిస్తున్నారు. రెనాల్ట్ కైగర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.81 లక్షల నుంచి రూ. 10.40 లక్షల మధ్య ఉంటుంది.
రెనాల్ట్ ట్రైబర్ డిస్కౌంట్ ఆఫర్లు :
రెనాల్ట్ ట్రైబర్ ఎంపీవీ నవంబర్‌లో రూ. 55వేల వరకు విలువైన బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో రూ. 25వేల వరకు క్యాష్ డిస్కౌంట్ కూడా ఉంది. అదనంగా, మీ పాత కారును ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాప్ చేయడం ద్వారా రూ. 25వేల వరకు బోనస్ పొందవచ్చు. కంపెనీ ట్రైబర్‌పై లాయల్టీ బెనిఫిట్స్ కూడా పేర్కొంది. కానీ, గరిష్ట మొత్తాన్ని వెల్లడించలేదు.
రెనాల్ట్ క్విడ్ డిస్కౌంట్ ఆఫర్లు :
తక్కువ బడ్జెట్లో చిన్న కారు కొనేవారికి రెనాల్ట్ క్విడ్ అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. ఈ హ్యాచ్‌బ్యాక్‌పై మొత్తం రూ. 40వేల వరకు ఆదా చేసుకోవచ్చు. ఇందులో రూ. 15వేల వరకు క్యాష్ డిస్కౌంట్, పాత కారును ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాప్ చేసినప్పుడు రూ. 25వేల వరకు బోనస్ పొందవచ్చు. అయితే, క్విడ్‌పై కంపెనీ ఎలాంటి నిర్దిష్ట కార్పొరేట్, గ్రామీణ, లేదా లాయల్టీ బెనిఫిట్స్ అందించడం లేదు. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.53 లక్షల నుంచి రూ. 5.61 లక్షల మధ్య ఉంటుంది.


