- కొత్త కారు కొనాలనుకుంటున్నారా?
- రూ.20 లక్షల్లో అదిరిపోయే ఈవీ ఎస్‌యూవీలు ఇవే
- రూ.12 లక్షల నుంచే ఎలక్ట్రిక్ కార్లు.. ధర, రేంజ్, ఫీచర్లు
టాటా కర్వ్ ఈవీ :
కూపే ఎస్యూవీ డిజైన్ ఇష్టపడేవారికి ఇది చాలా బాగుంటుంది. ప్రారంభ ధర రూ.17.19 లక్షలు కాగా, 45 kWh, 55 kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. భారీ బ్యాటరీ వేరియంట్ 502 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది.
ఎంజీ విండ్సర్ ఈవీ :
క్యాబిన్ స్పేస్, సౌకర్యానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవారికి ఈ కారు చాలా బెస్ట్.. ప్రారంభ ధర రూ.14.85 లక్షలు మాత్రమే.. 38 kWh, 52.9 kWh బ్యాటరీలతో వస్తుంది. గరిష్ఠంగా 449 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్, 604 లీటర్ల బూట్ స్పేస్ ఆకర్షణీయమైన ఫీచర్లుగా చెప్పొచ్చు..
టాటా నెక్సాన్ ఈవీ :
తక్కువ ధరలో మంచి ఎలక్ట్రిక్ కారు కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. ప్రారంభ ధర రూ.12.49 లక్షలు. 30kWh, 45kWh బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. వేరియంట్‌ను బట్టి 275 నుంచి 489 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. మీ బడ్జెట్, రోజువారీ ప్రయాణం, ఛార్జింగ్ అవసరాలను బట్టి సరైన ఈవీ కారును ఎంచుకోవచ్చు..


