కెమెరాల విషయానికి వస్తే.. OIS సపోర్ట్‌తో 200MP ప్రైమరీ కెమెరా, 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉండనున్నాయి. సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 50MP కెమెరా అందించారు.
బ్యాటరీ విషయంలోనూ తగ్గేదేలే.. :
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 చిప్సెట్తో రన్ అయ్యే ఈ ఫోన్లో 16GB వరకు ర్యామ్, 1TB వరకు స్టోరేజ్ ఉండొచ్చని సమాచారం. 7,000mAh బ్యాటరీకి 100W వైర్డ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తుంది.
కెమెరా, బ్యాటరీ, పర్ఫార్మెన్స్ పరంగా ఇలా అన్ని కేటగిరీల్లో షావోమీ 18 ప్రో ఆసక్తికరమైన ఫోన్‌గా కనిపిస్తోంది. అయితే, భారత ధర, లాంచ్ తేదీ, పూర్తి ఫీచర్లపై షావోమీ అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే..


