- రూ.2,250 తగ్గింపుతో శాంసంగ్ 5G ఫోన్..
- 6000mAh బ్యాటరీ, 50ఎంపీ కెమెరాతో అదిరిపోయే డీల్
- 50MP ట్రిపుల్ కెమెరా, భారీ బ్యాటరీ.. బ్యాంక్ ఆఫర్‌తో చౌకగా
శాంసంగ్ ఫోన్లో ఫీచర్లు ఎలా ఉన్నాయంటే? :
ఈ ఫోన్లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రోలింగ్, వీడియోలు చూడటం మరింత స్మూత్‌గా ఉంటుంది. డిస్ప్లేకు కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ కూడా ఉంది.
క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌తో రన్ అయ్యే ఈ ఫోన్లో 8GB వరకు ర్యామ్, 256GB వరకు స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. సర్కిల్ టు సెర్చ్, జెమిని, ఏఐ వాయిస్ ట్రాన్స్ క్రిప్షన్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
కెమెరాల విషయానికి వస్తే..
బ్యాక్ సైడ్ OIS సపోర్ట్‌తో 50MP మెయిన్ కెమెరా, 5MP అల్ట్రా వైడ్, 2MP మాక్రో కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా అందించారు.
ఇక ఈ ఫోన్లో 6,000mAh భారీ బ్యాటరీ మరో స్పెషాలిటీ.. దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. మొత్తంగా భారీ బ్యాటరీ, అమోల్డ్ డిస్ప్లే, 5జీ కనెక్టివిటీ కోరుకునే వారికి ఈ డీల్ అద్భుతంగా ఉంటుంది.


