- శాంసంగ్ గెలాక్సీ F70 5జీపై అదిరిపోయే ఆఫర్..
- తక్కువ ధరలో శాంసంగ్ 5జీ ఫోన్ కావాలా?
- శాంసంగ్ 5జీ ఫోన్‌పై 37శాతం డిస్కౌంట్..
- ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే డీల్ ఎలా పొందాలంటే?
ఫీచర్లు ఎలా ఉన్నాయంటే? :
ఈ ఫోన్లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఇచ్చారు. 90Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రోలింగ్, వీడియోలు చూడటం మరింత స్మూత్‌గా ఉంటుంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. కేవలం 7.5mm మందంతో స్లిమ్ డిజైన్‌లో వస్తుంది. IP54 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కూడా అందిస్తుంది.
పర్ఫార్మెన్స్ పరంగా పరిశీలిస్తే.. ఎక్సినోస్ 1330 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మాలి-జీ68 జీపీయూ, వన్ యూఐ సాఫ్ట్‌వేర్‌తో పాటు సర్కిల్ టు సెర్చ్, జెమిని, శాంసంగ్ వ్యాలెట్, కోనెక్స్ సెక్యూరిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
కెమెరా విషయానికి వస్తే.. 50MP మెయిన్ కెమెరా స్పెషల్ అట్రాక్షన్.. ఇందులో OIS సపోర్ట్ ఉండటంతో ఫొటోలు, వీడియోలు తీసేటప్పుడు చేతులు కొద్దిగా కదిలినా బ్లర్ లేకుండా ఫొటోలు వస్తాయి..
ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. 5,000mAh కెపాసిటీ అందించారు. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 2TB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.
కొనడం మంచిదేనా? :
మొత్తంగా చూస్తే.. మంచి అమోల్డ్ డిస్ప్లే, OIS కెమెరా, స్లిమ్ డిజైన్‌తో శాంసంగ్ ఫోన్ కావాలనుకునే వారికి గెలాక్సీ F70 5జీ అద్భుతమైన ఆప్షన్ కావచ్చు. అయితే, 25W ఛార్జింగ్ స్పీడ్ కొంత తక్కువే. కొనుగోలు చేసే ముందు ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్, బ్యాంక్ డిస్కౌంట్, అదనపు ఛార్జీలను చెక్ చేశాకే కొనడం బెటర్..


