తెలంగాణ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్.. రూ.3.50 లక్షలకే ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్లు.. తొలి విడతలో 2,400 ఇళ్లు

Must read

Indiramma Towers: సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునే అల్పాదాయ వర్గాల (LIG) ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ఇందిరమ్మ ఇళ్ల టవర్స్(Indiramma Towers) పథకంలో భాగంగా క్యూర్ (CURE) పరిధి మినహాయించి రాష్ట్రంలోని మిగతా కార్పొరేషన్లలో నిర్మించే ఫ్లాట్లను లబ్ధిదారులకు కేవలం రూ.3.50 లక్షలకే అందించాలని నిర్ణయించింది. 512 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఒక్కో ఫ్లాటుకు ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీతో పాటు ఉచితంగా స్థలం కేటాయిస్తోంది. లబ్ధిదారులు తమ వాటా రూ.3.50 లక్షలను నాలుగు విడతల్లో సులభంగా చెల్లించే వెసులుబాటు కల్పించారు.

తొలి విడతలో 2,400 ఫ్లాట్లు.. ఎక్కడెక్కడ నిర్మిస్తారంటే?

మొదటి విడతలో ఐదు ప్రధాన ప్రాంతాల్లో 480 చొప్పున మొత్తం 2,400 ఫ్లాట్ల నిర్మాణానికి హౌసింగ్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. నిజామాబాద్‌లోని నాగారం (ఆర్‌జీకే కాలనీ), గ్రేటర్ వరంగల్ పరిధిలోని గొర్రెకుంట, మడికొండ, నల్గొండలోని మామిళ్లగూడ (డీవీకే రోడ్డు), మహబూబ్‌నగర్‌లోని బండమీదిపల్లిలో ఈ టవర్లను నిర్మించనున్నారు.

దరఖాస్తు విధానం, అర్హత నిబంధనలు ఇవే!

సంబంధిత కార్పొరేషన్ పరిధిలో సొంత ఇల్లు లేదా ప్లాటు లేని, రూ.6 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్నవారు మీ-సేవా కేంద్రాల ద్వారా రూ.100 రుసుం, రూ.10 వేల టోకెన్ అడ్వాన్స్ చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. లాటరీ పద్ధతిలో 360 డిగ్రీల విచారణ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. కేటాయించిన ఫ్లాట్లను పదేళ్ల వరకు విక్రయించరాదు, అద్దెకు ఇవ్వరాదు.

రాబోయే రెండేళ్లలో మరిన్ని కార్పొరేషన్లకు విస్తరణ:

ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కరీంనగర్, కొత్తగూడెం, మంచిర్యాలతో పాటు మరిన్ని పురపాలికల్లో ఇందిరమ్మ టవర్లను నిర్మించనున్నారు. అలాగే క్యూర్ పరిధిలో ఆటోడ్రైవర్ల కోసం ప్రత్యేకంగా 4,000 ఫ్లాట్ల నిర్మాణానికి ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తోంది. సందేహాల కోసం 040-24603572 కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!