- తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యం..
- భారత్ సమిట్‌పై రేవంత్ కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ వేదికగా గ్లోబల్ ఫోకస్..
- భారత్ సమిట్‌తో తెలంగాణకు కొత్త గుర్తింపు
కేంద్రంపై రేవంత్ ఆరోపణలు :
అయితే, కొంతమంది ప్రతినిధులను చివరి నిమిషంలో కేంద్ర ప్రభుత్వం అడ్డుకుందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత కూడా కొందరు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.
మరోవైపు, భారత్ సమిట్ కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపైనా సీఎం స్పందించారు. కిషన్‌రెడ్డి, రామచందర్‌రావు, కేసీఆర్‌కు ఈ కార్యక్రమంపై ఎందుకంత వ్యతిరేకత ఉందో అర్థం కావడం లేదన్నారు. ఏ అంశం లేకపోయినా విపక్షాలు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు..
2047 నాటికి తెలంగాణ లక్ష్యం ఇదే :
వాతావరణ మార్పులు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు వంటి కీలక అంశాలపై సమిట్‌లో చర్చలు జరుగుతున్నాయని వివరించారు. తెలంగాణ, హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలను విదేశీ ప్రతినిధులకు చూపించి, రాష్ట్రంపై నమ్మకం కలిగించడమే తమ ప్రయత్నమన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని సీఎం రేవంత్ వెల్లడించారు.


