పరిషత్‌ పోరులో గెలుపెవరిది? కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. 365 కేంద్రాల్లో భారీ ఏర్పాట్లు!

Must read

  • అభ్యర్థుల్లో టెన్షన్‌.. పార్టీల్లో ఉత్కంఠ.. 7నే పరిషత్‌ ఫలితాలు
  • 28 జిల్లాల్లో పరిషత్‌ కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
  • మరికొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్న ఓటర్లు

AP MPTC-ZPTC Election Results : పరిషత్ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.. అభ్యర్థుల భవితవ్యాన్ని మరికొద్ది గంటల్లో ఓటర్లు తేల్చనున్నారు. ఎవరి జాతకం త్వరలో ఎలా ఉందో తేలిపోనుంది. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందడి ముగిసింది..

ఇక ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ మొదలైంది.. ఇన్నాళ్లూ ప్రచారాలు, హామీలు, ఇంటింటి తిరుగుళ్లతో ఓటర్లను ఆకట్టుకున్న అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల కోసం అభ్యర్థులతో పాటు రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి :

రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లోని 365 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ మొదలుకానుంది. తొలి ఫలితం వెలువడేందుకు కనీసం 4 గంటల సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో ఉదయం నుంచే కౌంటింగ్ కేంద్రాల దగ్గర సందడి కనిపించనుంది.

Read Also : 

70.72 శాతం పోలింగ్ నమోదు :
ఈ ఎన్నికల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 70.72 శాతం పోలింగ్ నమోదవడం విశేషం.. భారీ వర్షాలు, వరదల కారణంగా వాయిదా పడిన 5 మండలాల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మరో 3 జిల్లాల్లో వివిధ కారణాలతో తిరిగి పోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది..

30వేల మందికి పైగా సిబ్బంది :
కౌంటింగ్ ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం పక్కా ఏర్పాట్లు చేసింది. దాదాపు 30 వేల మందికి పైగా సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. 11 వేల మందికి పైగా కౌంటింగ్ సూపర్‌వైజర్లు, 28,500 మంది కౌంటింగ్ సిబ్బంది, సహాయకులు లెక్కింపు బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు..

ఇక అసలు ఉత్కంఠ మొదలైంది.. ఎవరి అంచనాలు నిజమవుతాయి? ఎవరికి ప్రజల మద్దతు దక్కుతుంది? ఏ పార్టీకి పైచేయి లభిస్తుంది? మరికొన్ని గంటల్లో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకనుంది. అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటే, కార్యకర్తలు మాత్రం తమ నాయకుడి గెలుపుపై ధీమాగా కనిపిస్తున్నారు..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!