SBIలో నాలుగేళ్ల FDతో ఎంత వడ్డీ వస్తుందో తెలుసా? సీనియర్ సిటిజన్లకు ఊహించని రాబడి..!

Must read

  • బ్యాంకులో డబ్బు దాచాలనుకుంటున్నారా?
  • ఎస్బీఐలో రూ.లక్ష ఎఫ్‌డీ చేస్తే ఎంతొస్తుంది?
  • సీనియర్ సిటిజన్లకు భారీ మొత్తంలో రాబడి

SBI 4-Year FD Interest Rates : చేతిలో కొంత డబ్బు ఉందా? దాన్ని ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియడం లేదా? స్టాక్ మార్కెట్‌లో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేకపోతే బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) బెస్ట్ ఆప్షన్.. ముఖ్యంగా స్థిరమైన వడ్డీతో సేవింగ్స్ పెంచుకోవాలనుకునే వారికి ఎఫ్‌డీలు అద్భుతంగా ఉంటాయి..

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ కూడా వివిధ టెన్యూర్ ద్వారా ఎఫ్‌డీ స్కీమ్స్ అందిస్తోంది. మరి నాలుగేళ్ల పాటు డబ్బు డిపాజిట్ చేస్తే ఎంత వడ్డీ వస్తుంది? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

నాలుగేళ్ల FDపై వడ్డీ ఎంతంటే? :
ఎస్‌బీఐలో నాలుగేళ్ల కాలపరిమితి ఎఫ్‌డీపై సాధారణ ఖాతాదారులకు ఏడాదికి 6.30 శాతం వడ్డీ లభిస్తుంది. అదే 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు 6.80 శాతం వడ్డీ అందుతుంది. ఇక 80 ఏళ్లు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్లకు 6.90 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.

Read Also : 

అంటే.. ఒకే మొత్తాన్ని ఒకే కాలపరిమితికి డిపాజిట్ చేసినా వయసును బట్టి వచ్చే వడ్డీలో తేడా ఉంటుంది. ముఖ్యంగా పెద్ద వయసు వారికి సాధారణ ఖాతాదారులతో పోలిస్తే అదనపు ప్రయోజనం లభిస్తుంది..

సీనియర్లకు అదనపు వడ్డీ బెనిఫిట్ :
సాధారణ కస్టమర్లతో పోలిస్తే.. సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం అదనపు వడ్డీ లభిస్తుంది. సూపర్ సీనియర్ సిటిజన్లకు మరో 0.10 శాతం అదనపు బెనిఫిట్ ఉంటుంది. దీంతో రిటైర్మెంట్ తర్వాత తమ దగ్గర ఉన్న సేవింగ్‌పై స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఈ స్కీమ్ అద్భుతంగా ఉంటుంది.

ఎంత వరకు డిపాజిట్ చేయొచ్చు? :
ఈ పథకంలో గరిష్టంగా రూ.2,99,99,999 వరకు డిపాజిట్ చేయవచ్చు.. అయితే, ఎఫ్‌డీపై వచ్చే వడ్డీకి వర్తించే పన్ను నిబంధనలను కూడా గుర్తుంచుకోవాలి.. ఈ వడ్డీ రేట్లు డిసెంబర్ 2025లో సవరించిన వివరాల ఆధారంగా ఉన్నాయి..

డిపాజిట్ చేసే ముందు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ లేదా బ్యాంకు బ్రాంచ్‌లో లేటెస్ట్ వడ్డీ రేట్లు, నిబంధనలు తప్పనిసరిగా తెలుసుకోండి. వడ్డీ రాబడి డిపాజిట్ విధానం, పేమెంట్ ఆప్షన్లను బట్టి మారవచ్చు. ఏది ఏమైనా మీరు పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం బెటర్..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!