ఇది కదా డిస్కౌంట్.. ఈ శాంసంగ్ 5G అతి చౌకైన ధరకే.. ఇంతకన్నా తక్కువకు దొరకదు..!

Must read

  • రూ.30 వేలకే శాంసంగ్ గెలాక్సీ A56 5జీ..
  • 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లేతో ధర భారీగా తగ్గింపు
  • ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే డీల్.. SBI కార్డుతో మరింత ఆదా

Samsung Galaxy A56 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? ముఖ్యంగా మంచి కెమెరా, సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో మంచి ఫోన్ కోసం వెతుకుతున్నారా? అయితే శాంసంగ్ అభిమానులకు ఇదే బెస్ట్ ఆఫర్ అని చెప్పాలి.

ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ A56 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్‌తో ఈ ఫోన్‌ను రూ.31 వేల లోపే ఇంటికి తెచ్చుకోవచ్చు. మరి ఈ శాంసంగ్ ఫోన్ ధర, ఫీచర్లు, ఆఫర్ల వివరాలేంటో ఓసారి చూద్దాం..

శాంసంగ్ గెలాక్సీ A56 5జీ ధర, బ్యాంక్ ఆఫర్లు :
శాంసంగ్ గెలాక్సీ A56 5జీ ఫోన్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.33,348 ధరకు లభిస్తోంది. లైట్ వైలెట్ కలర్‌లో అందుబాటులో ఉంది. అయితే, ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.2,500 బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ.30,848కు తగ్గుతుంది..

Read Also : 

అదే ఎస్బీఐ డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే.. రూ.2వేలు తగ్గింపు లభిస్తుంది. అప్పుడు ఈ ఫోన్ రూ.31,348కే సొంతమవుతుంది. అయితే, ఈ ఆఫర్‌లో నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ కూడా అందుబాటులో లేదు. బ్యాంక్ ఆఫర్లు, ధరలు మారే అవకాశం ఉంది.. కొనుగోలు చేసే ముందు ఫ్లిప్‌కార్ట్‌లో వివరాలు ఓసారి చెక్ చేసుకోండి..

శాంసంగ్ గెలాక్సీ A56 5జీ ఫీచర్లు :
ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రోలింగ్, వీడియోలు చూడటం, గేమింగ్ మరింత స్మూత్‌గా ఉంటుంది. ఎక్సినోస్ 1580 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7పై రన్ అవుతుంది..

కెమెరాల విషయానికి వస్తే :
బ్యాక్ సైడ్ 50MP ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరా, 5MP మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 12MP కెమెరా అందించారు.. ఇక 5,000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది.

IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా ఉంది. 5జీ, Wi-Fi, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. మొత్తంగా చూస్తే మంచి డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీతో శాంసంగ్ ఫోన్ కోరుకునే వారికి ఈ డీల్ అద్భుతమైన ఆప్షన్..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!