రామాయణం ట్విట‌ర్ రివ్యూ.. రావ‌ణాసుడిగా య‌శ్ అద‌ర‌గొట్టేశాడు..!

Must read

Ramayana Twitter Review : భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిన చిత్రాల్లో ‘రామాయణం: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’ ఒక‌టి. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, కన్నడ స్టార్ యశ్ రావణుడిగా న‌టించిన ఈ చిత్రాన్ని దర్శకుడు నితేశ్ తివారీ తెర‌కెక్కించారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాస్టర్ మైండ్ క్రియేషన్స్, అట్లాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నమిత్ మల్హోత్రా, యష్, చార్లెస్ రోవన్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. తొలి భాగం నేడు (న‌వంబ‌ర్ 5) ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. చాలా చోట్ల షోలు ప‌డ్డాయి. ఈ చిత్రాన్ని వీక్షించిన వారు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ అభిప్రాయాల‌ను తెలియ‌జేస్తున్నారు.

ఈ చిత్రంలో విజువ‌ల్స్ అదిరిపోయాయ‌ని అంటున్నారు. న‌టీన‌టులు అద్భుత‌మైన న‌ట‌న‌తో ఈ చిత్రాన్ని నిల‌బెట్టార‌ని అంటున్నారు. ముఖ్యంగా రావ‌ణుడి య‌శ్ యాక్టింగ్ అదిరిపోయింద‌ని చెబుతున్నారు. ముఖ్యంగా రావణాసురుడి స్వభావం, ఆయన అంతర్మథనం, పరాక్రమాన్ని ఆవిష్కరించిన తీరు కొత్త అనుభూతిని ఇచ్చింద‌ని చెబుతున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!