ఇంగ్లాండ్ ఆట‌గాడికి కావ్య పాప బిగ్ షాక్.. సీఎస్‌కే, ఎస్ఆర్‌హెచ్ జ‌ట్ల మ‌ధ్య 4 గురు ఆట‌గాళ్ల ట్రేడ్ డీల్..

Must read

IPL 2027 : ఐపీఎల్ 2027కు ముందు కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్ల మ‌ధ్య న‌లుగురు ఆట‌గాళ్ల మార్పిడికి ఒప్పందం కుదిరింది. ఈ ట్రేడ్‌లో భాగంగా ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్, ఆస్ట్రేలియా ఆటగాడు జాక్ ఎడ్వర్డ్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు బ‌దిలీ అయ్యారు. వీరికి బదులుగా భారత పేసర్ ఖలీల్ అహ్మద్, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎల్లిస్ లు సీఎస్‌కే నుంచి ఎస్‌ఆర్‌హెచ్‌కు వ‌చ్చారు.

లివింగ్‌స్టోన్ ధర తగ్గింపు..

ఐపీఎల్ వేలంలో లియామ్ లివింగ్‌స్టోన్ రూ.13 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్ కొనుగోలు చేసింది. అయితే సీఎస్‌కేకు మారే సమయంలో అతడి ధరను రూ.6 కోట్లకు తగ్గించారు. ఆస్ట్రేలియా సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ మాత్రం తన పాత ధర రూ.3 కోట్లకే చెన్నై జట్టులో చేరాడు. అంతర్జాతీయ అరంగేట్రానికి ముందే ఎస్‌ఆర్‌హెచ్ అతడిని కొనుగోలు చేసింది. అయితే పాద గాయం కారణంగా అత‌డు ఐపీఎల్ 2026లో ఆడ‌లేదు.

ఈ ట్రేడ్‌లో భాగంగా భారత ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ రూ.4.8 కోట్ల పాత ధరతో హైదరాబాద్ జట్టులో చేరనున్నాడు. ఖలీల్ గతంలో 2018 నుంచి 2021 వరకు ఎస్‌ఆర్‌హెచ్ తరఫున ఆడాడు. ఐపీఎల్ 2025లో సీఎస్‌కే తరఫున 14 మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2026లో ఐదు మ్యాచ్‌లు ఆడిన తర్వాత కుడి తొడ కండరాల గాయంతో టోర్నీకి దూరమయ్యాడు.

మరోవైపు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎల్లిస్ రూ.2 కోట్ల పాత ధరతో ఎస్‌ఆర్‌హెచ్‌లో చేరనున్నాడు. డెత్ ఓవర్లలో వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగల సామర్థ్యం ఎల్లిస్ సొంతం. అతడి రాకతో హైదరాబాద్ పేస్ బౌలింగ్ విభాగానికి మరింత బలం చేకూరనుంది.

ఆట‌గాళ్ల రిటైన్ష‌న్‌, విడుద‌ల జాబితాల గ‌డువు న‌వంబ‌ర్ 17తో ముగియ‌నుంది. డెడ్‌లైన్ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌డంతో రాబోయే రోజుల్లో మ‌రికొంద‌రు ఆట‌గాళ్ల ట్రేడ్ డీల్స్ జ‌ర‌గ‌నున్నాయి. ఇక మినీ వేలం గోవా వేదిక‌గా డిసెంబ‌ర్ 16న జ‌ర‌గ‌నుంది.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!