అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. దలాల్ స్ట్రీట్‌లో బుల్స్ జాతర.. ఒక్కరోజే రూ.8 లక్షల కోట్ల లాభం!

Must read

  • ట్రంప్ పార్టీకి షాక్.. భారత స్టాక్ మార్కెట్లలో బంపర్ ర్యాలీ
  • ఇన్వెస్టర్ల పంట పండించిన స్టాక్ మార్కెట్లు
  • ఆకాశమే హద్దుగా సెన్సెక్స్, నిఫ్టీ.. 6 రోజులుగా లాభాల జోరు

Indian Stock Market Rally : అమెరికా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలతో భారత స్టాక్ మార్కెట్లకు కొత్త ఊపునిచ్చాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రిపబ్లికన్ పార్టీ మధ్యంతర ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది.

ఫలితంగా ప్రపంచ మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొంది. దీనికి తోడు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గడంతో భారత మార్కెట్లలో కొనుగోళ్ల జోరు కనిపించింది. గురువారం (నవంబర్ 5) ట్రేడింగ్ ముగిసే సమయానికి ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.8 లక్షల కోట్లకుపైగా పెరిగింది..

సెన్సెక్స్ 2 వేల పాయింట్లకు పైగా జంప్ :
గురువారం ఉదయం నుంచే దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడింగ్ మొదలైంది.. రోజంతా కొనుగోళ్ల జోరు కొనసాగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 2,008.61 పాయింట్లు (2.60 శాతం) పెరిగి 79,310.01 వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 576 పాయింట్లు (2.40 శాతం) లాభపడి 24,536.60 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్ రంగ షేర్లలోనూ భారీ కొనుగోళ్లు జరగడంతో నిఫ్టీ బ్యాంక్ 1,860 పాయింట్లు ఎగబాకింది..

Read Also : 

6 రోజులుగా లాభాల జోరు :
దేశీయ మార్కెట్లలో వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్‌లోనూ లాభాల పరంపర కొనసాగింది. గత 6 సెషన్లలో సెన్సెక్స్ దాదాపు 8.27 శాతం, నిఫ్టీ 8 శాతం మేర పెరిగాయి. ముఖ్యంగా ఆటోమొబైల్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఐటీ రంగాల షేర్లకు కొనుగోలుదారుల నుంచి ఫుల్ సపోర్టు లభించింది. బజాజ్ ఫైనాన్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ సుజుకీ వంటి షేర్లు మార్కెట్ ర్యాలీలో కీలకంగా నిలిచాయి..

క్రూడ్ ఆయిల్ తగ్గుదలతో భారత్‌కు ఊరట :

ఈ భారీ ర్యాలీకి మరో ముఖ్యమైన రీజన్.. ముడి చమురు ధరల భారీగా పతనమవ్వడమే.. అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల తర్వాత ఇరాన్‌తో యుద్ధ ఉద్రిక్తతలు తగ్గి, శాంతి చర్చలకు మార్గం సుగమం కావచ్చనే అంచనాలు పెరిగాయి. దీంతో బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా 8.7 శాతం పడిపోయి బ్యారెల్‌కు 94.62 డాలర్లకు చేరింది. చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్‌కు ఇది సానుకూల పరిణామంగా చెప్పొచ్చు..

ఇన్వెస్టర్లకు భారీ లాభాలు :
నవంబర్ 5న ఒక్కరోజే బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ వాల్యూ రూ.8 లక్షల కోట్లకుపైగా పెరిగింది. దీంతో మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.500 లక్షల కోట్ల మార్కును దాటింది. అంతర్జాతీయ పరిణామాలకు తోడు కంపెనీల రెండో త్రైమాసిక ఫలితాలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత బలోపేతం చేస్తున్నాయి..

అయితే, స్టాక్ మార్కెట్లు ఇదే వేగంతో ముందుకెళ్తాయని భావించడం సరికాదు.. క్రూడ్ ధరలు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, కంపెనీల ఆర్థిక ఫలితాలు రాబోయే రోజుల్లో కీలకంగా మారనున్నాయి. అందుకే ఇన్వెస్టర్లు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించడమే మంచిది..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!