దీపావళికి ఎక్సైటెల్ అదిరిపోయే ఆఫర్..
200Mbps స్పీడ్‌తో నెలల తరబడి ఫ్రీ ఇంటర్నెట్
ఎక్సైటెల్ నుంచి 3 నెలల వరకు ఫ్రీ వ్యాలిడిటీ
Excitel Diwali Dhamaka Offer : పండగ సీజన్ వచ్చిందంటే చాలు.. షాపింగ్ నుంచి స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ వరకు ఎక్కడ చూసినా ఆఫర్లే కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి బ్రాడ్‌బ్యాండ్ సేవలు కూడా చేరాయి.
ప్రముఖ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎక్సైటెల్ (Excitel) తమ కస్టమర్ల కోసం ‘దీపావళి ధమాకా’ పేరుతో ప్రత్యేక ప్రమోషనల్ ఆఫర్ తీసుకొచ్చింది. ముఖ్యంగా ఇంట్లో ఎక్కువగా ఇంటర్నెట్ వాడేవారికి ఈ ఆఫర్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది..
ఈ ఆఫర్లో భాగంగా 200Mbps వేగంతో వచ్చే 2 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లపై అదనపు వ్యాలిడిటీని ఫ్రీగా అందిస్తోంది. అయితే ఈ బెనిఫిట్స్ పాత కస్టమర్లకు కాదు.. కొత్తగా ఎక్సైటెల్ కనెక్షన్ తీసుకునే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయి. ఈ ప్రమోషన్ 2026 నవంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. కంపెనీ సర్వీస్ అందించే అన్ని ప్రాంతాల్లో ఈ ఆఫర్ వర్తిస్తుంది..
Read Also :
రూ.3వేల ప్లాన్‌తో 5 నెలల ఇంటర్నెట్ :
ఎక్సైటెల్ రూ.3వేల ప్లాన్‌లో భాగంగా 200Mbps వేగంతో 3 నెలల ఇంటర్నెట్ సేవలు లభిస్తాయి. దీపావళి ఆఫర్ కింద మరో 2 నెలల వ్యాలిడిటీని ఫ్రీగా అందిస్తోంది. దీంతో మొత్తం 5 నెలల పాటు ఇంటర్నెట్ వాడుకోవచ్చు.. ఈ ప్లాన్ ధరలో జీఎస్టీ, ఇన్స్టాలేషన్ ఛార్జీలు కూడా ఉన్నాయి. లెక్కల ప్రకారం.. నెలకు సుమారు రూ.600 ఖర్చుతో ఈ సేవలు పొందవచ్చు..
రూ.6వేల ప్లాన్‌తో ఏడాది పాటు కనెక్షన్ :
ఎక్కువ కాలం రీఛార్జ్ టెన్షన్ లేకుండా ఉండాలనుకునే వారి కోసం రూ.6వేలు ప్లాన్ ఉంది. ఇందులో సాధారణంగా 9 నెలల వ్యాలిడిటీ లభిస్తుండగా, ఆఫర్లో భాగంగా మరో 3 నెలలు ఫ్రీగా ఇస్తోంది. దీంతో మొత్తం 12 నెలల పాటు 200Mbps ఇంటర్నెట్ సేవలు పొందవచ్చు.
జీఎస్టీ, ఇన్స్టాలేషన్ ఛార్జీలు కూడా ఈ ధరలోనే ఉంటాయి. అంటే నెలకు సగటున రూ.500 ఖర్చుతో ఏడాది పాటు ఇంటర్నెట్ వాడుకోవచ్చు. మొత్తానికి, కొత్త బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకోవాలని చూస్తున్న వారికి ఎక్సైటెల్ దీపావళి ధమాకా ఆఫర్ మంచి అవకాశం.. అయితే, ఆఫర్ ముగిసేలోపు కనెక్షన్ తీసుకోవాలి. అలాగే మీ ప్రాంతంలో సర్వీసు అందుబాటులో ఉందా? ఇతర నిబంధనలను ముందుగా తెలుసుకోవడం బెటర్..


