అక్టోబర్‌లో ఆటోమొబైల్ రికార్డులు.. 5 లక్షలు దాటిన కార్ల అమ్మకాలు.. మారుతి టాప్, టాటా దెబ్బకు మహీంద్రా వెనక్కి..

Must read

  • భారత్‌లో కార్ల జాతర.. ఒక్క నెలలోనే 5 లక్షలకు పైగా అమ్మకాలు
  • కార్ల మార్కెట్‌లో మారుతీ కింగ్.. టాటా దూకుడు, మహీంద్రాకు షాక్
  • 5 లక్షలు దాటిన కార్ల అమ్మకాలు.. మారుతీ నంబర్ వన్, టాటా నంబర్ 2

October Car Sales 2026 : భారత ఆటోమొబైల్ రంగం అక్టోబర్ 2026లో సరికొత్త రికార్డు సృష్టించింది. దేశీయంగా ప్యాసింజర్ వాహనాల (PV) విక్రయాలు తొలిసారిగా ఒకే నెలలో 5 లక్షల యూనిట్ల మార్కును దాటాయి. నవరాత్రి, దసరా పండుగల సందర్భంగా పెరిగిన డిమాండ్‌తో పాటు జీఎస్టీ 2.0, వడ్డీ రేట్ల తగ్గింపు, ఆదాయపు పన్ను ప్రయోజనాలు విక్రయాలకు ఊతమిచ్చాయి..

అక్టోబర్‌లో దేశీయ ప్యాసింజర్ వాహనాల హోల్‌సేల్స్ 5.25 లక్షల నుంచి 5.30 లక్షల యూనిట్ల మధ్య నమోదైనట్లు అంచనా. గత ఏడాది ఇదే (October Car Sales 2026) నెలలోని 4.68 లక్షల యూనిట్లతో పోలిస్తే 12-13 శాతం వృద్ధి నమోదైంది. గతంలో 2026 జూలైలో నమోదైన 4.69 లక్షల యూనిట్ల రికార్డు తాజా అమ్మకాలతో చెరిగిపోయింది..

దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ అక్టోబర్‌లో 2.12 లక్షల వాహనాలను విక్రయించి 20.45 శాతం వృద్ధి సాధించింది. ఇందులో ఎస్‌యూవీల విక్రయాలు రికార్డు స్థాయిలో 73,058 యూనిట్లకు చేరాయి. వాగన్‌ఆర్ 23,747, డిజైర్ 20,649, ఎర్టిగా 20,641 యూనిట్లు అమ్ముడయ్యాయి. సీఎన్‌జీ కార్ల విక్రయాలు సుమారు 87 వేల యూనిట్లుగా నమోదయ్యాయి.

టూవీలర్ విభాగంలో హోండా 6.65 లక్షలు, టీవీఎస్ 5.15 లక్షలు, రాయల్ ఎన్‌ఫీల్డ్ 1.21 లక్షల యూనిట్ల విక్రయాలు సాధించాయి. వాణిజ్య వాహనాల విభాగంలో టాటా మోటార్స్ విక్రయాలు 13.32 శాతం పెరిగి 39,784 యూనిట్లకు చేరాయి. అయితే, ట్రాక్టర్ల విక్రయాల్లో తగ్గుదల కనిపించింది. మహీంద్రా ట్రాక్టర్ల అమ్మకాలు 13.1 శాతం, ఎస్కార్ట్స్ కుబోటా విక్రయాలు 10.92 శాతం తగ్గాయి.

మారుతీ సుజుకీ 2.12 లక్షల విక్రయాలతో రికార్డు :

దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ అక్టోబర్‌లో 2.12 లక్షల ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. 2025లో ఇదే నెలలో నమోదైన 1.76 లక్షల యూనిట్లతో పోలిస్తే.. 20.45 శాతం వృద్ధి సాధించింది.

మారుతీ సుజుకీ మోడళ్లలో అక్టోబర్‌లో వాగన్‌ఆర్ 23,747 యూనిట్లు, డిజైర్ 20,649 యూనిట్లు, ఎర్టిగా 20,641 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఎస్‌యూవీ విభాగంలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 73,058 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.

ఇందులో బ్రెజ్జా 22,436 యూనిట్లు, ఫ్రాంక్స్ దాదాపు 20 వేల యూనిట్లు, విక్టోరిస్ సుమారు 17 వేల యూనిట్లు, గ్రాండ్ విటారా దాదాపు 11 వేల యూనిట్ల విక్రయాలు సాధించాయి. చిన్న కార్ల విక్రయాలు 40,443 యూనిట్లుగా ఉండగా, సీఎన్‌జీ కార్ల అమ్మకాలు సుమారు 87 వేల యూనిట్లకు చేరాయి.

మొత్తం విక్రయాల్లో సీఎన్‌జీ వాటా దాదాపు 40 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మారుతీ వాహనాల విక్రయాల వాటా 53.4 శాతానికి చేరింది. ఒకే నెలలో 2 లక్షల ప్యాసింజర్ వాహనాల విక్రయాల మైలురాయిని దాటిన తొలి ఆటోమొబైల్ కంపెనీగా నిలిచింది.

ఇతర కార్ల కంపెనీలదీ రికార్డు :

టాటా మోటార్స్ :
అక్టోబర్‌లో దేశీయ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 20.87 శాతం పెరిగి 73,894 యూనిట్లకు చేరాయి. గత ఏడాది ఇదే నెలలో 61,134 యూనిట్లుగా ఉన్నాయి. బుకింగ్స్ కూడా రికార్డు స్థాయికి చేరగా, పంచ్ ఈవీ విక్రయాలు 5వేల యూనిట్ల మైలురాయిని దాటాయి. ఎలక్ట్రిక్, సీఎన్‌జీ వాహనాలకు డిమాండ్ సరఫరాను మించిపోయిందని, తద్వారా మరింత ఉత్పత్తిని పెంచుతున్నామని కంపెనీ వెల్లడించింది.

మహీంద్రా అండ్ మహీంద్రా :
అక్టోబర్‌లో 73,338 యూనిట్ల ఎస్‌యూవీలను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో నమోదైన 71,624 యూనిట్లతో పోలిస్తే 2.39 శాతం వృద్ధి సాధించింది. పండుగల సీజన్, కొత్త మోడళ్లతో మెరుగుపరిచిన వాహన రేంజ్ కారణంగా ఎస్‌యూవీలకు డిమాండ్ పెరిగింది. కంపెనీ తొలి సీఎన్‌జీ వాహనం ఎక్స్‌యూవీ 3XO ZNGకు కూడా మంచి స్పందన లభిస్తోంది.

హ్యుందాయ్ :
అక్టోబర్‌లో దేశీయ విక్రయాలు 16.74 శాతం వృద్ధితో 62,799 యూనిట్లకు చేరాయి. గత ఏడాది ఇదే నెలలో 53,792 యూనిట్లు నమోదయ్యాయి. పండుగల సీజన్‌లో రికార్డు విక్రయాలు సాధించింది. హ్యుందాయ్ బయాన్ మోడల్ దేశీయంగా, 50కి పైగా ఎగుమతి మార్కెట్లలో కంపెనీ వృద్ధి సాధించింది.

కియా ఇండియా :
అక్టోబర్‌లో 33,462 వాహనాలను విక్రయించింది. 2025లో ఇదే నెలలో నమోదైన 29,556 యూనిట్లతో పోలిస్తే.. 13.22 శాతం వృద్ధి సాధించింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే గత విక్రయాల రికార్డును అధిగమించి సరికొత్త గరిష్ఠాన్ని నమోదు చేసింది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!