280 కి.మీ. స్పీడ్.. 8 కోచ్‌లు.. 557 మంది ప్రయాణం! భారత్ తొలి బుల్లెట్ ట్రైన్‌లో ప్రత్యేకతలివే..!

Must read

  • మన బుల్లెట్ ట్రైన్‌లో అదిరిపోయే ఫీచర్లు ఏంటో తెలుసా?
  • 8 కోచ్‌లు.. 557 సీట్లు.. భారత్ బుల్లెట్ ట్రైన్‌లో ఇన్ని ప్రత్యేకతలా?
  • బెంగళూరులో తయారీ.. ముంబై టు అహ్మదాబాద్..

India First Bullet Train : మన బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తోంది.. భారత్‌లో రైలు ప్రయాణమే పూర్తిగా మారబోతోంది.. ఇప్పటివరకు విదేశాల్లో మాత్రమే కనిపించిన బుల్లెట్ ట్రైన్ ప్రయాణం త్వరలో మన దేశంలోనూ అందుబాటులోకి రానుంది. ముంబై-అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్న హైస్పీడ్ రైలు కారిడార్ కోసం దేశీయ తొలి స్వదేశీ బుల్లెట్ ట్రైన్ తయారీ పనులు కొనసాగుతున్నాయి.

బెంగళూరులోని BEML (భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్) ప్లాంట్‌లో ఈ రైలు రూపుదిద్దుకుంటోంది. భారత వాతావరణ పరిస్థితులు, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మన ఇంజినీర్లే దీనిని స్వయంగా డిజైన్ చేయడం విశేషం..

280 కి.మీ. టాప్ స్పీడ్‌తో ట్రయల్స్ నిర్వహించేందుకు ఈ రైలు రూపొందించారు.. గంటకు 249 కి.మీ. వేగంతో ప్రయాణించనుంది. మొత్తం 202 మీటర్ల పొడవుతో 8 కోచ్‌లు ఉంటాయి. ఇందులో 4 మోటార్ కోచ్‌లు, 4 ట్రైలర్ కోచ్‌లు ఉంటాయి.

557 మందితో ప్రయాణం :
మొత్తం 557 మంది ప్రయాణించవచ్చు. ఏడింటిలో 3×2 సీటింగ్‌తో స్టాండర్డ్ క్లాస్, ఒక కోచ్‌లో 2×2 సీటింగ్‌తో ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఏర్పాటు చేస్తున్నారు. దివ్యాంగులు, ప్రత్యేక అవసరాలున్న ప్రయాణికుల కోసం 2 సీట్లు కేటాయించారు.

Read Also : 

ప్రయాణికులకు ఎక్కువ లెగ్‌రూమ్, సౌకర్యవంతమైన సీట్లు, ప్రతి వరుసకు పెద్ద కిటికీలు ఉండనున్నాయి. ల్యాప్‌టాప్‌లు, మొబైళ్లకు ప్రత్యేక ఛార్జింగ్ పాయింట్లు, లగేజీ కోసం ఓవర్‌హెడ్ ర్యాక్‌లు, ప్రత్యేక లగేజీ స్టాండ్లు ఏర్పాటు చేస్తున్నారు. బయో డైజెస్టర్ టాయిలెట్లు కూడా అందుబాటులో ఉంటాయి.

పలు భాషల్లో ప్రయాణ సమాచారం :
ఇంగ్లీష్, హిందీ, ప్రాంతీయ భాషల్లో LCD స్క్రీన్ల ద్వారా ప్రయాణ సమాచారం అందుతుంది. వై-ఫై ఆధారిత ఇన్ఫోటైన్‌మెంట్, ఆటోమేటిక్ అనౌన్స్‌మెంట్లు, అత్యవసర సమయాల్లో సిబ్బందితో మాట్లాడేందుకు టాక్‌బ్యాక్ సదుపాయం ఉంటాయి. బ్రెయిలీ ఇండికేషన్లు, వీల్‌చైర్‌కు అనుకూలమైన టాయిలెట్లు, లెవల్ బోర్డింగ్ సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు.

India First Bullet Train Photos

India First Bullet Train Features (AI Image) 

అద్భుతమైన ఫీచర్లు :
ప్రతి కోచ్‌లో డ్యూయల్ HVAC సిస్టమ్ ద్వారా ఉష్ణోగ్రత, తేమ కంట్రోల్ చేస్తారు.. శబ్దాన్ని తగ్గించే ఇన్సులేషన్, 25KV ఏసీ విద్యుత్ వ్యవస్థ, బ్రేకింగ్ సమయంలో విద్యుత్‌ను తిరిగి గ్రిడ్‌కు పంపే రీజెనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీ ప్రత్యేక ఆకర్షణలుగా చెప్పొచ్చు..

గాలి నిరోధకత, టన్నెల్స్‌లో శబ్దాన్ని తగ్గించేలా ఏరోడైనమిక్ డిజైన్ చేశారు. మొత్తానికి వేగం, సౌకర్యం, సాంకేతికత కలగలిసిన కొత్త ప్రయాణ అనుభవాన్ని భారత్‌కు పరిచయం చేసేందుకు ఈ బుల్లెట్ ట్రైన్ రెడీ అవుతోంది..

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!