భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. హానర్ X9e లాంచ్
8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో ఫీచర్లు అదుర్స్
3 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర తెలిస్తే షాకవుతారు
Honor X9e Launch : స్మార్ట్‌ఫోన్ తెగ వాడేవాళ్లకు బ్యాటరీ విషయంలో ఇక టెన్షన్ తగ్గనుంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ (Honor) భారీ బ్యాటరీతో మరో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. హానర్ X9e పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్లో ఏకంగా 8,560mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీని అందించింది.
ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 3 రోజుల వరకు బ్యాకప్ వస్తుందని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ను హానర్ మధ్యప్రాచ్య మార్కెట్లో లాంచ్ చేసింది. ఫోన్ డిజైన్ హానర్ టర్బో 5జీ మాదిరిగా ఉండగా, ఫీచర్లు కూడా దాదాపు అదే రేంజ్ ఉన్నాయి.
ధర ఎంతంటే? :
ఈ ఫోన్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో సింగిల్ వేరియంట్లో లభిస్తోంది. ధర 1,499 సౌదీ రియాల్స్ ఉంటుంది. భారత కరెన్సీలో సుమారు రూ.38వేలు ఉంటుంది. డాన్ ఆరెంజ్, గ్లేసియర్ వైట్, మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Read Also :
కొనుగోలుపై సుమారు రూ.7,500 విలువైన గిఫ్టులు కూడా కంపెనీ అందిస్తోంది. ఇందులో హానర్ కాఫీ కప్, ఏడాది పాటు యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్, బ్యాటరీ కెపాసిటీపై ఒక ఏడాది గ్యారెంటీ అందిస్తుంది.
హానర్ X9e ఫీచర్లు ఇవే :
ఈ ఫోన్లో 6.79 అంగుళాల 1.5K అమోల్డ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. కేవలం 7.76mm మందంతో ఉండే ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్‌తో రన్ అయ్యే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్ఓఎస్10పై రన్ అవుతుంది.
కెమెరాల విషయానికి వస్తే.. :
బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ, 5MP అల్ట్రా వైడ్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా అందించారు. Wi-Fi 6, బ్లూటూత్ 5.2, NFC, యూఎస్బీ టైప్-సీ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. మొత్తానికి భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, అమోల్డ్ డిస్ప్లేతో హానర్ X9e ఆకట్టుకుంటోంది. అయితే, ఈ ఫోన్ భారత్‌లో ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు.



